Zonal Council Meeting: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరిస్తాం.. జోనల్ కౌన్సిల్ సమావేశంలో అమిత్ షా
Southern Zonal Council: తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన దక్షిణాధి రాష్ట్రాల సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్..
Southern Zonal Council: తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన దక్షిణాధి రాష్ట్రాల సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సమావేశాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. సమావేశానికి హాజరైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పుదుచ్చేరి సీఎం రంగస్వామి, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేష్ కుమార్, తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్నుముడి, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు నివేదికలపై చర్చ జరిగింది. 24 కొత్త అంశాలతో పాటు ఖరారు చేసే అంశాలపై కూడా చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు విషయాలను ప్రస్తావించారు. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్ధేశిత సమయంలో పరిష్కారం కావాలని అన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, న్యాయం చేసేలా చొరవ చూపాలని ఆయన కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోవడం లేదని, ఆ హామీని నెరవేర్చాలని కోరారు.
రాష్ట్రాల మధ్య సమస్యలున్నాయి..
రాష్ట్రాల మధ్య సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు మాకు రుణాల్లో కోత విధిస్తున్నారని జగన్ అన్నారు. ఇక గ్రేహౌండ్స్ ఏర్పాటుపై సీఎం జగన్ మాట్లాడగా.. స్థలం ఇస్తే తామే ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. శిక్షణ పొందిన వారిలో సగం మందిని కేంద్ర బలగాలకు ఇవ్వాలని అమిత్ షా అన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు స్థలం మార్పును నోటిఫికేషన్ ద్వారా ప్రకటించాలని జగన్ విజ్ఞప్తి చేయగా, అమిత్ షా అంగీకరించారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిగణలోకి తీసుకుని త్వరలోనే పరిష్కరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి నెల రోజుల్లోనే కార్యాచరణ సిద్దం చేయాలని అమిత్‌షా ఆదేశించారు.
సమస్యలను పరిష్కరిస్తాం..
ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సమస్యలపై అమిత్‌షా స్పందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు రాష్ట్రాలకు చెందినవి మాత్రమే కాకుండా ఇవి జాతీయ అంశాలని అన్నారు. ఏపీ సీఎం జగన్ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలనే ప్రస్తావించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్ధేశిత సమయంలోగా పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేయాలని అన్నారు. విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు ఇంకా అమలు కావడం లేదని అన్నారు. సమస్యలన్నీ పరిష్కారం కాకుండానే మిగిలిపోతున్నాయని, దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుతుందని అన్నారు.
ఇవి కూడా చదవండి: