AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎస్వీబీసీలో మళ్ళీ పోర్న్ కలకలం.. అయిదుగురిపై వేటు.. మరో నలుగురికి షోకాజ్ నోటీసులు

కలియుగ దైవం తిరుమల శ్రీవారి చెందిన ఎస్వీబీసీ( శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌)లో పోర్న్ వీడియోలు దర్శనం ఇవ్వడం కలకలం రేపిన విషయం తెలిసిందే.

ఎస్వీబీసీలో మళ్ళీ పోర్న్ కలకలం.. అయిదుగురిపై వేటు.. మరో నలుగురికి షోకాజ్ నోటీసులు
Rajeev Rayala
| Edited By: |

Updated on: Jun 22, 2021 | 3:53 PM

Share

కలియుగ దైవం తిరుమల శ్రీవారి చెందిన ఎస్వీబీసీ( శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌)లో పోర్న్ వీడియోలు దర్శనం ఇవ్వడం కలకలం రేపిన విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం ఓ కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి ఓ భక్తుడు మెయిల్ చేశాడు. ఆ భక్తుడికి ఎస్వీబీసీ ఉద్యోగి ఓ పోర్న్‌ సైట్‌ వీడియోను పంపాడు. దీంతో అవాక్కైన ఆ భక్తుడు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డిలకు ఫిర్యాదు చేశాడు. దాంతో వారు వెంటనే చర్యలు తీసుకున్నారు. పోర్న్‌ సైట్ వీడియో పంపిన ఉద్యోగితో పాటు కార్యాలయంలో అలాంటి సైట్లు చూస్తున్న ఉద్యోగులను సైబర్ క్రైమ్ టీమ్ గుర్తించింది. వీరితో పాటు కార్యాలయంలో విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని సైబర్ క్రైమ్‌ టీమ్‌ గుర్తించింది. తాజాగా ఈ వ్యవహారంలో మరో ఐదుగురు ఉద్యోగులను టీటీడీ తొలగించింది. మరో నలుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసారు. తొలగించిన వారిలో వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు ఉన్నారు. ఇక షోకాజ్ నోటీసులు అందుకున్నవారిలో ఛానెల్ మేనేజర్లు, జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. ఆఫీస్ లో పోర్న్ వీడియోలు చూస్తున్నట్టుగా నిర్దారణ అయ్యింది. పవిత్రమైన భక్తి ఛానెల్లో పని చేస్తూ తప్పుడు పనులు చేస్తున్నందుకు టీటీడీ సదరు ఉద్యోగులను తొలగించింది.  ఈ వ్యవహారం పై  విజిలెన్స్ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Follow Us
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?