Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం కలకలం..  బార్బర్ క్వార్టర్స్ వద్ద మద్యం విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్

నిషేధాన్నిపట్టించుకోకుండా పవిత్ర పుణ్యక్షేత్రాల్లో కాని పనులు చేస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా తిరుమలలో మద్యం బాటిల్స్ తో పట్టుబడ్డారు. 

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం కలకలం..  బార్బర్ క్వార్టర్స్ వద్ద మద్యం విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్
Liquor Bottles In Tirumala

Updated on: Feb 19, 2023 | 6:59 AM

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో సిగరెట్స్, మద్యం తాగడం,  మాంసాలు అమ్మడం వంటి కార్యక్రమాలను అపవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రాల పరిసరాలలో మద్యం అమ్మడం, తాగడం వంటి వాటిపై నిషేధం ఉంది. అయినప్పటికీ కొందరు ఈ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఈ నిషేధాన్ని పట్టించుకోకుండా పవిత్ర పుణ్యక్షేత్రాల్లో కాని పనులు చేస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా తిరుమలలో మద్యం బాటిల్స్ తో పట్టుబడ్డారు.

తాజాగా కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి క్షేత్రంలో మద్యం కలకలం చెలరేగింది. బార్బర్ క్వార్టర్స్ వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు SEB సిబ్బంది. వారి నుంచి 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తిరుమలలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని సమాచారంతో దాడులు చేశారు ఎస్ఈబీ అధికారులు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురు నిందితులు అనంతపురం జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

కూలీ పనుల కోసం తిరుమలకు వచ్చి.. తిరుపతి నుండి అక్రమంగా మద్యం తరలించి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులు సుమలత, నాగేంద్ర ప్రసాద్, బిన్నీ, ప్రవీణ్ కుమార్ లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..