AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలిపిరి చెక్‌పోస్ట్‌ దగ్గర మరోసారి భద్రతా వైఫల్యం.. కొండపైకి రెండు టీవీలు తీసుకెళ్లిన యూపీ వాసులు

తిరుమల కొండ... శ్రీవారి నిలయంగానే చూస్తాం తప్ప.. మరే విధమైన కార్యక్రమాలకూ అంగీకరించబోం అని.. పూటకో నిషేధాన్ని అమల్లో పెడుతుంది టీటీడీ. కానీ... అక్కడ పరిస్థితి మాత్రం పూర్తిగా విరుద్ధం. కొండమీదికి యదేచ్ఛగా వెళ్లొచ్చు, రావొచ్చు.. ఏవైనా తీసుకుపోవచ్చు.. తీసుకురావొచ్చు అని మరోసారి తేలిపోయింది. విజిలెన్స్ వాళ్లు విజిలేసి ఊరుకుంటున్నారా అనే సందేహాలు మళ్లీ రిపీటౌతున్నాయి.

అలిపిరి చెక్‌పోస్ట్‌ దగ్గర మరోసారి భద్రతా వైఫల్యం.. కొండపైకి రెండు టీవీలు తీసుకెళ్లిన యూపీ వాసులు
Tirumala
Ram Naramaneni
|

Updated on: Jul 08, 2023 | 5:33 PM

Share

తిరుమల శ్రీవారి సన్నిధి ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రం.. అంతకంటే ముఖ్యంగా అత్యంత సున్నితమైన ప్రాంతం. అందుకే.. భద్రత విషయంలో కట్టుదిట్టంగా ఉంటుంది టీటీడీ. కానీ… ఎంత చేసినా కొండమీద భద్రత మాత్రం ఉండీ లేనట్టుండే బ్రహ్మపదార్థంలాగే మారుతోంది. లేటెస్ట్‌గా అలిపిరి మార్గంలో మరోసారి భద్రతా వైఫల్యం బైటపడింది. టీవీ సెట్లను కిందనుంచి పైకి తీసుకెళ్లి యదేచ్ఛగా అమ్మకాలు జరపడం విస్తుగొలుపుతోంది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తులు… టెలివిజన్ సెట్లతో స్కూటీపై తిరుమల చేరుకున్నారు. వీధివీధీ తిరుగుతూ సెకండ్ హ్యాండ్ టీవీలు అమ్ముకోవడం వీళ్ల వృత్తి. కొండపై GNC దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ వీళ్లను ఆపి, నిలదీస్తే పొంతన లేని సమాధానాలొచ్చాయి. అనుమానం వచ్చి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అలిపిరి దగ్గర మమ్మల్ని ఎవరూ ఆపలేదు… ఎలాంటి తనిఖీలూ చేయలేదు అంటూ వీళ్లు చెప్పిన మాటలు.. తిరుమల మార్గంలో తనిఖీ వ్యవస్థపై మరోసారి ప్రశ్నల్ని లేవనెత్తాయి.

అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర సిబ్బంది పనితీరుపై విమర్శలు కొత్తవి కాదు. నాలుగు రోజుల కిందట కర్ణాటక నుంచి ఓ కుటుంబం ఏకంగా పెంపుడు కుక్కతో తిరుమలకు చేరుకుంది. గతంలో గంజాయి, మద్యం, మాంసం ఆనవాళ్లు కూడా తిరుమలలో కనిపించాయి. చూస్తాం చేస్తాం అంటూ స్టేట్‌మెంట్లు ఇవ్వడమే తప్ప డ్యూటీ పట్ల టీటీడీ విజిలెన్స్ వాళ్ల చిత్తశుద్ధులు మచ్చుకైనా కనిపించవు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ