మనవరాలితో కలిసి అమ్మమ్మ.. నానమ్మల దొంగతనాలు! ఒంటరి మహిళ ఇంట్లో అద్దెకు దిగి భారీ చోరీ..
ఒంటరి మహిళ లక్ష్యంగా.. ముగ్గురు కిలాడి లేడీలు దారుణానికి పాల్పడ్డారు. ఇంట్లో అద్దెకు దిగి.. ఎవరూలేని సమయంలో బంగారం, వెండి వస్తువులు దొంగిలించి పరారయ్యారు. మనవరాలితో కలిసి సొంత అమ్మమ్మ, నానమ్మలు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ షాకింగ్ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది..

గుడివాడ, సెప్టెంబర్ 4: ఒంటరిగా ఉంటున్న మహిళను ఇల్లు అద్దెకు కావాలి అని నమ్మించి.. ముగ్గురు కిలాడి లేడీలు దారుణానికి పాల్పడ్డారు. ఇంట్లో అద్దెకు దిగి.. ఎవరూలేని సమయంలో బంగారం, వెండి వస్తువులు దొంగిలించి పరారయ్యారు. మనవరాలితో కలిసి సొంత అమ్మమ్మ, నానమ్మలు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ షాకింగ్ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ధీరజ్ వినీల్ తెలిపిన వివరాల ప్రకారం..
గుడివాడ లక్ష్మీనగర్ కాలనీలో శేషుకుమారి అనే ఒంటరి మహిళ కాపురం ఉంటోంది. ఇల్లు అద్దెకు కావాలి అని విజయవాడకు చెందిన మానేపల్లి గీత మాధురి.. శేషు కుమారిని సంప్రదించింది. ఆనక అడ్వాన్స్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత సామాన్లతో అద్దె ఇంట్లో దిగిన మాధురి.. శేషుకుమారినీ తీర్థ యాత్రలకు షిర్డీ తీసుకువెళతానని నమ్మించింది. అయితే షిర్డీకి తీసుకు వెళ్తున్నానని చెప్పి శేషుకుమారినీ గుడివాడ రైల్వే స్టేషన్ కి తీసుకువెళ్లింది. పథకం ప్రకారంగానే రైలు వెళ్ళిన తరువాత ఆమెను రైల్వే స్టేషన్ కి తీసుకువెళ్లింది నిందితురాలు మాధురి. అయితే ట్రైన్ వెళ్ళిపోయిందని సదరు మహిళను తీసుకుని ఇంటికి తిరిగి తీసుకువచ్చింది. ఇంటి తాళం పగలకొట్టి నిందితురాలు మాధురి తెచ్చుకున్న తాళం ఆ ఇంటికి వేసింది.
ఆ తర్వాత శేషుకుమారిని చిన్న తిరుపతి తీసుకొని వెళ్ళి, అక్కడ నుంచి షిర్డీ తీసుకువెళ్లింది. షిర్డీ నుండి తిరిగి వస్తున్న సమయంలో ఆమెను విజయవాడలో ఉంచింది. అయితే ముందుగా వీరు వేసుకున్న ప్లాన్ ప్రకారం ముందుగా ఇంటికి వచ్చి ఇంటి తాళం తీసి బీరువాను ఆటోలో ఎక్కించి పారిపోయారు. బీరువాలో 106 గ్రాముల బంగారం, 326 గ్రాములు వెండి, రెండు పట్టుచీరలు దొంగిలించినట్లు డీఎస్పీ ధీరజ్ వినీల్ తెలిపారు. నిందితురాలు మాధురి, అమ్మమ్మ, నానమ్మతో కలిసి ఈ దొంగతనం చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.








