Chandrayaan-3: మనోళ్లదే హవా.. చంద్రయాన్-3 సక్సెస్‌లో కీలకమైన ఆ ముగ్గురు శాస్త్రవేత్తలు ఎవరో తెలుసా..?

| Edited By: Shaik Madar Saheb

Sep 05, 2023 | 4:49 PM

Chandrayaan-3 Project: ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో కీలకమైన క్లిష్టమైన ప్రయోగాలను చేస్తోంది.. అందులో చంద్రయాన్ 3 సక్సెస్‌తో భారత్ మొత్తం గర్వంగా ఫీలయింది.. ఇస్రో శాస్త్రవేత్తలు సమిష్టి కృషితో చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ చేయడమే కాకుండా అనుకున్న దానికంటే మెరుగ్గా పనిచేసింది.. ఇంకా పని చేస్తుంది కూడా..

Chandrayaan-3: మనోళ్లదే హవా.. చంద్రయాన్-3 సక్సెస్‌లో కీలకమైన ఆ ముగ్గురు శాస్త్రవేత్తలు ఎవరో తెలుసా..?
Chandrayaan 3
Follow us on

Chandrayaan-3 Project: ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో కీలకమైన క్లిష్టమైన ప్రయోగాలను చేస్తోంది.. అందులో చంద్రయాన్ 3 సక్సెస్‌తో భారత్ మొత్తం గర్వంగా ఫీలయింది.. ఇస్రో శాస్త్రవేత్తలు సమిష్టి కృషితో చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ చేయడమే కాకుండా అనుకున్న దానికంటే మెరుగ్గా పనిచేసింది.. ఇంకా పని చేస్తుంది కూడా.. వాస్తవానికి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 లోని రోవర్, ల్యాండర్ 14 రోజులు మాత్రమే పనిచేస్తాయని ప్రకటించారు.. కానీ ఇకపై కూడా రోవర్ పనిచేస్తుందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. చంద్రుడిపై అనేక దేశాలు ప్రయోగాలు చేశాయి. కానీ ఇప్పటివరకు దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన దేశం భారత్ మాత్రమే.. అలాంటి క్లిష్టమైన, కీలకమైన ప్రయోగంలో ముగ్గురు శాస్త్రవేత్తల పాత్ర ప్రధానంగా చెప్పుకోవాలి.. ఆ ముగ్గురు కూడా తెలుగు వారు కావడం గొప్ప విషయంగా రెండు రాష్ట్రాల ప్రజలు గర్విస్తున్నారు..

చంద్రయాన్-3 లో కీలక పాత్ర పోషించిన తెలుగు శాస్త్రవేత్తలు వీరే..

ISRO

వల్లూరు ఉమామహేశ్వరరావు – చంద్రయాన్ 3 ఆపరేషన్ మేనేజర్

వల్లూరు ఉమామహేశ్వరరావు ఖమ్మం జిల్లాకు చెందినవారు. నర్సరీ నుంచి నాలుగవ తరగతి వరకు ఖమ్మంలో చదివారు. 5 నుంచి 7 వరకు మామిళ్లగూడెం పాఠశాలలో చదివారు.. 8 నుంచి పది వరకు న్యూ ఎరా స్కూల్ ఖమ్మంలో విద్యనభ్యసించారు. ఉమామహేశ్వరావు పదవ తరగతిలో 600 మార్కులకు గాను 534 మార్కులు సాధించారు. 2007 నుంచి 2009 వరకు ఇంటర్మీయట్ చదివారు. ఇంటర్‌ను విజయవాడలోని శ్రీ చైతన్య రామన్ భవన్‌లో చదవగా.. వెయ్యి మార్కులకు గాను 955 మార్కులు సాధించారు. 2009 నుంచి 2013 వరకు బీటెక్ ను కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం ఫిజికల్ సైన్స్ ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ సైన్స్ టెక్నాలజీలో పూర్తిచేసి ఆల్ ఇండియా ర్యాంకులో 136 సాధించి తొలి ప్రయత్నంలోనే ఇస్రో జాబ్ సాధించారు.

2013 నుంచి 2020 వరకు ఎంసిఎఫ్ హసన్‌లో ఉద్యోగం చేశారు. 2020 లో యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్లో శాస్త్రవేత్తగా జాయిన్ అయి చంద్రయాన్ 3 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన ల్యాండర్, రోవర్ ఆపరేషన్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టి విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి

మొట్టమర్రి శ్రీకాంత్ – మిషన్ డైరెక్టర్.

ఏపీలోని విశాఖపట్నం నగరానికి చెందిన మొట్టమర్రి శ్రీకాంత్ మచిలీపట్నంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదివారు.. అనంతరం సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏవిఎస్ డిగ్రీ కాలేజీ విశాఖలో చదివారు.. ఆంధ్రాయూనివర్సిటీలో ఎలక్ట్రికల్ సైన్సులో ఎంఎస్‌సీ పట్టా పొందారు.. అనంతపురం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఎంటెక్ పూర్తిచేసి బెంగుళూరు ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరారు. ఇస్రోలో శాస్త్రవేత్తగా అంచెలంచెలుగా ఎదుగుతూ.. మార్స్ మిషన్‌కు ఆపరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2019లో చంద్రయాన్ 2కు ఆఖరి క్షణంలో క్రాస్ ల్యాండింగ్‌కు డిప్యూటీ మిషన్ డైరెక్టర్‌గా పనిచేసి.. 2023లో చంద్రయాన్ 3కి మిషన్ డైరెక్టర్‌గా పనిచేశారు.

కందురి కిరణ్ కుమార్.. ఆపరేషన్ డైరెక్టర్

ఆంధ్రప్రదేశ్ నంద్యాలకు చెందిన కందురి కిరణ్ కుమార్ ఇస్రోలో కీలక బాధ్యతలను చేపట్టి విజయవంతంగా పూర్తిచేశారు. చంద్రయాన్ -3 ప్రాజెక్టులో ఆపరేషన్ డైరక్టర్ గా బాధ్యతలు చేపట్టి విజయం సాధించారు.

ISRO

ఇలా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు ఇప్పటికే జీశాట్ 29, న్యావిగేషన్ శాటిలైట్‌లో వన్ డీ, వన్ ఈ, వన్ ఎఫ్ తో పాటు చంద్రయాన్ 3 లో కీలక పాత్ర పోషించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..