Andhra Pradesh: భక్తుడి వేషం..చోరి నైజం… ట్టకేలకు పోలీసులకు చిక్కిన వైనం… భక్తులారా జర భద్రం!

| Edited By: Jyothi Gadda

Dec 21, 2023 | 3:24 PM

Guntur: భక్తులు హాడావుడిగా వచ్చి బైక్ పార్క్ చేసి ఆలయంలోకి వెళతారు. కొద్దీ సేపటి తర్వాత బయటకు వచ్చి చూస్తే బైక్ లో పెట్టిన నగదు, సెల్ ఫోన్లు మాయం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అరటి పళ్ల వ్యాపారి బైక్ లో నలభై వేల రూపాయలు పెట్ట గుడిలోకి వెళ్లి వచ్చి చూడగా నగదు మాయమైంది.  దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అయప్ప భక్తుడు బైక్ కవర్ లో ఫోన్ పెట్టి లోపలికి వెళ్లి వచ్చే లోపే ఫోన్ కాజేశారు. వీటితో పాటు మరొక భక్తుడి బైక్ కూడా అపహరణకు గురైంది. దీంతో గంగానమ్మ పేట శివాలయానికి దర్శనానికి  వచ్చే భక్తుల్లో టెర్రర్ మొదలైంది.

Andhra Pradesh: భక్తుడి వేషం..చోరి నైజం... ట్టకేలకు పోలీసులకు చిక్కిన వైనం... భక్తులారా జర భద్రం!
Man Steals A Bag
Follow us on

గుంటూరు, డిసెంబర్21; కార్తీక, ధనుర్మాసాలు కావటంతో భక్తులు ఆలయాలకు క్యూ కడుతుంటారు. ఈ రెండు నెలలు ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లోని ఆలయాలు కిటకిటలాడుతుంటాయి. దీంతో ఇప్పుడు దొంగలు కూడా కిటకిటలాడే ఆలయాలపైనే ద్రుష్టి పెట్టారు. భగవంతుడి దగ్గరకు వచ్చే భక్తుల విలువైన వస్తువులు కొట్టేస్తూ ఎవరికీ చిక్కకుండా తప్పించుకుంటున్నారు. అయితే సిసి కెమెరాల పుణ్యమా అని కొద్దీ రోజుల తర్వాతైన పోలీసులకు పట్టుబడుతున్నారు.  సరిగ్గా అలాంటి సంఘటనే గుంటూరు జిల్లా తెనాలిలోని గంగానమ్మపేట శివాలయం పరిసరాల్లో చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ విజువల్ ఆధారంగా చోరీ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తెనాలిలోని గంగానమ్మపేట శివాలయం పరిసర ప్రాంతాల్లో చోరులు నక్కి ఉంటారు. గుడుల ముందు పార్క్ చేసి వెళ్లే టూ వీలర్స్ ను టార్గెట్ చేస్తుంటారు. బైక్ డిక్కీలు, సైడ్ బాక్స్ ల్లో దాచుకున్న డబ్బులు, సెల్ ఫోన్లు, విలువైన వస్తువులను అపహరిస్తుంటారు. భక్తులు హాడావుడిగా వచ్చి బైక్ పార్క్ చేసి ఆలయంలోకి వెళతారు. కొద్దీ సేపటి తర్వాత బయటకు వచ్చి చూస్తే బైక్ లో పెట్టిన నగదు, సెల్ ఫోన్లు మాయం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అరటి పళ్ల వ్యాపారి బైక్ లో నలభై వేల రూపాయలు పెట్ట గుడిలోకి వెళ్లి వచ్చి చూడగా నగదు మాయమైంది.  దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అయప్ప భక్తుడు బైక్ కవర్ లో ఫోన్ పెట్టి లోపలికి వెళ్లి వచ్చే లోపే ఫోన్ కాజేశారు. వీటితో పాటు మరొక భక్తుడి బైక్ కూడా అపహరణకు గురైంది. దీంతో గంగానమ్మ పేట శివాలయానికి దర్శనానికి  వచ్చే భక్తుల్లో టెర్రర్ మొదలైంది.

అయితే కార్తీక మాసం ముగిసిన కొద్దీ రోజుల్లోనే బైక్ డిక్కి ఓపెన్ చేస్తున్న ఒక వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆ సమీపంలోనే ఉన్న సిసి కెమెరా విజువల్స్ ను పరిశీలించగా ఒక వ్యక్తి చాకచక్యంగా బైక్ డిక్కీలు ఓపెన్ చేస్తున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. గుట్టుచప్పుడు కూడా నకిలీ తాళాలతో డిక్కీలు ఓపెన్ చేసిన అందులో ఉన్న విలువైన వస్తువులను కొట్టేస్తున్నాడు. ఈ విజువల్స్ ను పోలీసులకు ఇచ్చి అసలు దొంగలను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అయితే దొంగ ఒక్కడే ఉన్నాడా లేక ఏదైనా ముఠా ఇటువంటి తరహా చోరిలకు పాల్పడుతుందా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..