Marriage Fight Viral Video: పెళ్లి భోజనంలో పన్నీర్‌ ముక్క పడలేదని.. విందుకోసం వేసిన కూర్చీలు ముక్కలు చేశారు..

విందు భోజనంలో ఇది లేదు, అది లేదు అంటూ హంగామా చేస్తుంటారు. అంతేకాదు.. కొన్ని కొన్ని సందర్భాల్లో బంధువుల మధ్య మాటలతో పరస్పరం వివాదాలు, గొడవల వరకు వెళ్లిన సంఘటనలు కూడా సోషల్ మీడియాలో చూశాం.. అలాంటిదే ఇప్పుడు మరో పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . భోజనంలో పనీర్ లేకపోవడంతో వధూవరుల వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Marriage Fight Viral Video: పెళ్లి భోజనంలో పన్నీర్‌ ముక్క పడలేదని.. విందుకోసం వేసిన కూర్చీలు ముక్కలు చేశారు..
Marriage Fight
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 21, 2023 | 2:47 PM

సోషల్ మీడియాలో మీరు చాలా పెళ్లి వీడియోలు చూసి ఉంటారు. ఇంటర్నెట్‌లో కనిపించే ఫన్నీ వెడ్డింగ్ వీడియోలు మనల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. పెళ్లిళ్లలో వధూవరుల సరదా సన్నివేశాలు, జోకులు, ఆటపట్టించే అల్లరి పనులు, చిలిపి చేష్టలకు సంబంధించినవి అనేకం మనల్ని ఆనందింప జేస్తుంటాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సందడి ఇక ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పెళ్లిలో ఏది తక్కువైన చుట్టాలు, బంధువులే ముందుగా రియాక్ట్‌ అయ్యేది. విందు భోజనంలో ఇది లేదు, అది లేదు అంటూ హంగామా చేస్తుంటారు. అంతేకాదు.. కొన్ని కొన్ని సందర్భాల్లో బంధువుల మధ్య మాటలతో పరస్పరం వివాదాలు, గొడవల వరకు వెళ్లిన సంఘటనలు కూడా సోషల్ మీడియాలో చూశాం.. అలాంటిదే ఇప్పుడు మరో పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . భోజనంలో పనీర్ లేకపోవడంతో వధూవరుల వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఘటన ఎలా జరిగింది..? దాని పూర్తి సమాచారాన్ని ఇక్కడ చూడండి.

వైరల్ అవుతున్న వీడియోలో వధూవరుల మధ్య గొడవలు జరుగుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఈ వీడియోను @gharkekalesh ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ‘కళేష్ బి/డబ్ల్యు వరుడు, వధువు తరపు బంధువులు మ్యారేజ్ సమయంలో వారికి వడ్డించిన వంటకాల్లో పనీర్ ముక్కలు పడలేదని గొడవకు దిగారు. వధూవరుల మధ్య గొడవకు ఇదే కారణం. చెప్పాలంటే, ఈ పెళ్లి భోజనంలో మటర్ పనీర్ ప్రత్యేకంగా నిలిచింది. పెళ్లికి వచ్చిన బంధువులు భోజనానికి కూర్చున్నప్పుడు మత్తర్ పనీర్ వడ్డిస్తారు. కానీ భోజనప్రియులకు వడ్డించిన మత్తర్ పనీర్‌లో ఒక్క పనీర్ ముక్క కూడా కనిపించలేదు. దీంతో భోజనప్రియులు కళ్లేర్ర జేశారు. ప్లేట్ లో పన్నీర్ ముక్క పడలేదనే కోపంతో పగ తీర్చుకున్నారు. పాత కక్షలేవో ఉన్నట్టుగా ప్రతీకారం తీర్చుకున్నారు. కూర్చీలు, బెంచీలు ఎత్తుకుని కొట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

భోజనప్రియులు తమకు వడ్డించిన మటన్ పనీర్‌లో పనీర్ లేదని నిలదీశారు. ఈ క్రమంలోనే వారి మధ్య మాటా మాటా పెరిరగింది. వాగ్వాదం తీవ్రరూపం దాల్చటంతో ఇరువర్గాల మధ్య వివాదం మరింత పెరిగింది. పరస్పరం కలబడి కొట్టుకునే స్థాయికి చేరుకుంది. పనీర్ ముక్క కోసం, పెళ్లి విందు కోసం వేసిన కుర్చీలు ముక్కలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..