AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుళ్లో హుండీ మాయం.. నెల తర్వాత ఊహించని సీన్‌! అంతా అమ్మవారి మహిమే..

భక్తులు కానుకలు, ముడుపుల రూపంలో దేవుడికి చెల్లించిన కానుకల పెట్టెను ఓ దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత హుండీ పగలగొట్టి అందులోని సొమ్మును బయటకు తీశారు కూడా. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ ఎత్తుకెళ్లిన మొత్తం సొమ్మును తిరిగి అదే గుడిలో వదిలేసి చెంపలేసుకుని వెళ్లారు..

గుళ్లో హుండీ మాయం.. నెల తర్వాత ఊహించని సీన్‌! అంతా అమ్మవారి మహిమే..
Temple Hundi Theft In Anantapur District
Srilakshmi C
|

Updated on: Sep 05, 2025 | 4:35 PM

Share

అనంతపురం, సెప్టెంబర్‌ 5: ఓ దొంగల ముఠా కాపుకాసి ఏకంగా దేవుడి గుడిలోనే చోరీ చేశారు. భక్తులు కానుకలు, ముడుపుల రూపంలో దేవుడికి చెల్లించిన కానుకల పెట్టెను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత హుండీ పగలగొట్టి అందులోని సొమ్మును బయటకు తీశారు కూడా. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ ఎత్తుకెళ్లిన మొత్తం సొమ్మును తిరిగి అదే గుడిలో వదిలేసి చెంపలేసుకుని వెళ్లారు. ఈ విచిత్ర ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని నెల క్రితం ఓ ఆలయంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం చెరువుకట్ట వద్ద ఉన్న ముసలమ్మ ఆలయంలో నెల రోజుల క్రితం చోరీ జరిగింది. కొందరు గుర్తు తెలియని దుండగులు గుళ్లోకి ప్రవేశించి.. హుండీని ఎత్తుకెళ్లారు. అయితే నెల రోజులు గడిచాక ఏం జరిగిందో తెలియదుగానీ చోరీ చేసిన నగదును ఓ సంచిలో ఉంచి.. గుడి ఆవరణలో ఉంచి వెళ్లారు. చోరీ చేసిన నగదుతో పాటు ఓ లేఖను కూడా దొంగలు ఆలయం వద్ద ఉంచి వెళ్లారు. ఉదయం పూజాదికార్యక్రమాల కోసం గుడి చెరచిన పూజారికి.. గుడి ఆవరణలో డబ్బుల మూట కనిపించింది. అక్కడే ఉన్న లేఖను విప్పి చూడగా.. గుడి హుండీలో డబ్బు దొంగిలించడంతో తమ పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారని, తప్పై పోయిందని లేఖలో పేర్కొన్నారు. ఇక దొంగలు తిరిగి తెచ్చిన డబ్బును ఆలయ నిర్వాహకులు లెక్కించగా.. మొత్తం రూ.1,86,486 ఉన్నట్లు గుర్తించారు.

Temple Hundi Theft

ఇవి కూడా చదవండి

అమ్మవారి మహత్యం వల్లే దోచుకెళ్లిన నగదును దొంగలు తిరిగి తీసుకొచ్చి తెచ్చిపెట్టారని ఆలయ నిర్వాహకులు చెప్పారు. స్థానికంగా చోటు చేసుకున్న ఈ ఆసక్తికర సంఘటన చుట్టు పక్కల టాక్‌ ఆఫ్‌ ది టైన్‌గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా