పాఠశాలలో దొంగలు పడ్డారు.. స్టూడెంట్స్ కోసం ఉంచిన 12 ట్యాబ్ లు చోరీ.

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు జడ్పీ హైస్కూల్లో చోరీ జరగడం కలకలం రేపుతోంది.

పాఠశాలలో దొంగలు పడ్డారు.. స్టూడెంట్స్ కోసం ఉంచిన 12 ట్యాబ్ లు చోరీ.
Robbery
Follow us
Aravind B

|

Updated on: Mar 21, 2023 | 8:30 AM

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు జడ్పీ హైస్కూల్లో చోరీ జరగడం కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఉపాధ్యాయుల ఉండే గదిలోని బీరువాలో భద్రపరిచిన 12 ట్యాబ్ లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఇన్ ఛార్జి, ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు ఏఎస్సై ధర్మారావు కేసు నమోదు చేశారు. భీమవరం రూరల్ సీఐ సీహెచ్ నాగప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే చోరీ జరిగిన ఘటనా స్థలానికి క్లూస్ టీం సిబ్బంది వచ్చి వేలి ముద్రలు సేకరించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి