Sharanandji Maharaj: ఉత్తరాదిలో మిస్… దక్షిణాదిలో ట్రేస్.. మధుర స్వామికి ముక్కంటి క్షేత్రంలో పనేంటి..?
మధుర స్వామికి ముక్కంటి క్షేత్రంలో పనేంటి..? ఎందుకొచ్చారు మూడో కంటి తెలియకుండా వ్యవహరించిన నిఘా వ్యవస్థల్లో రహస్యమేంటి..? ఉత్తరాదిలో మిస్... దక్షిణాదిలో ట్రేస్.. బాగా పలుకుబడి ఉన్న ఆ స్వామీజీ ఎందుకు ఇక్కడికి వచ్చాడు. అసలు ఎవరికి తెలియకుండా ఎందుకొచ్చారు అదే ఇప్పుడు చర్చగా మారింది.
మధుర స్వామికి ముక్కంటి క్షేత్రంలో పనేంటి..? ఎందుకొచ్చారు మూడో కంటి తెలియకుండా వ్యవహరించిన నిఘా వ్యవస్థల్లో రహస్యమేంటి..? ఉత్తరాదిలో మిస్… దక్షిణాదిలో ట్రేస్.. బాగా పలుకుబడి ఉన్న ఆ స్వామీజీ ఎందుకు ఇక్కడికి వచ్చాడు. అసలు ఎవరికి తెలియకుండా ఎందుకొచ్చారు అదే ఇప్పుడు చర్చగా మారింది.
దేశ రాజధాని ఢిల్లి సమీపంలోని మధుర స్వామిజీకి శ్రీకాళహస్తిలో పనేంటి..? అతని కోసం కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు ఎందుకు రహస్యంగా వెతికాయి. ఆయన కనపడటం లేదన్న కనీస ఫిర్యాదు లేకపోయినా, ఏ ఒక్క పోలీసు స్టేషన్ లోనూ మిస్సింగ్ కేసు నమోదైనట్లు మీడియాకు, భక్తులకు తెలియకుండా పోలీసులు ఆయన కోసం ఎందుకు జల్లెడ పట్టారు. ఇంతకీ ఆ మధుర స్వామిజీ ఎవరు..? ఆయనకున్న ప్రాధాన్యత ఏంటి అన్నదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఆయనే గురు శరానంద్‌జీ మహారాజ్.. ఢిల్లీ సమీపంలోని మధుర ప్రాంతంలో ఉదాసిన్ కర్షిణి ఆశ్రమ పీఠాధిపతి. ఉన్నట్లుండి తిరుపతి జిల్లాలో ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్‌గా మారింది. దేశంలోని ప్రముఖ హిందు సంస్థల్లో ఒకటైన శ్రీ ఉదాసీన్ కర్షిణీ ఆశ్రమ పీఠాధిపతిగా ఉన్న శరానంద్‌జీ మహారాజ్ శ్రీకాళహస్తిలోని శుక బ్రహ్మాస్త్రంకు వచ్చారు. ఆయన రాక ఎవరికీ తెలియదు. ఇక్కడికి వచ్చినట్లు పోలీసు యంత్రాంగంకు సమాచారం ఉండటంతో అత్యంత రహస్యంగా ఈ విషయాన్ని ఉంచడంపై పెద్ద చర్చకు దారితీసింది.
శరానంద్ జీ మహారాజ్ కు చెందిన ఆశ్రమానికి దేశ విదేశాల్లో వేల కోట్ల విలువైన ఆస్తులు ఉండగా భక్తులు, శిష్యులు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారు. మధుర ప్రాంతంలో ఉన్న ఆశ్రమానికి పీఠాధిపతిగా ఉన్న మహారాజ్ స్వామిజీ ఉన్న పళంగా తిరుపతి జిల్లాకు రావడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా, ముస్లిం క్రైస్తవ మత పెద్దల తో ఎన్నో చర్చలు, సమావేశాల్లో పాల్గొని, నిర్వహించి ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకున్నారు శరానంద్ జీ మహారాజ్. ఎంతోమంది రాజకీయ నాయకులకు కూడా గురువుగా ఉన్నారు. స్వామిజీని గురువుగా భావించే ఎందరో ఆశీస్సులు కోసం పరితపిస్తారు.
మరి అంతటి గొప్ప జీవితాన్ని గడుపుతున్న స్వామీజీకి ఏం కష్టం వచ్చిందో గానీ మధుర ఆశ్రమాన్ని ఆయన విడిచి వచ్చేయడం చర్చగా మారింది. కేంద్ర నిఘా వర్గాలు శరానంద్ జీ మహారాజ్ ఆచూకీ తెలుసుకునేందుకు రహస్యంగా వెతకడం అలజడికి కారణమైంది. దేశ, రాష్ట్ర నిఘా వ్యవస్థలకు శరానంద్ జీ మహారాజ్ ను కనిపెట్టమన్న ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం రహస్యంగా ఈ పని చేసింది. ఢిల్లీ నుంచి కొన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ మూడు రోజుల క్రితం తిరుమల చేరుకున్నారన్న సమాచారం కేంద్ర నిఘా వ్యవస్థల నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులతో వచ్చింది.
ఈ మేరకు ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో తిరుపతి జిల్లా పోలీసులు స్వామీజీ తిరుమల చేరుకొని, వెంకన్నకు తలనీలాలు సమర్పించి సాధారణ భక్తుడిగానే దర్శనం చేసుకున్నట్లు తెలిసింది. ఆ తరువాత శ్రీకాళహస్తి లోని శుకబ్రహ్మ ఆశ్రమానికి చేరుకున్న శరానంద్ జీ మహారాజ్ శ్రీకాళహస్తి ఆశ్రమంలో కొద్దికాలం ఉండాలని ఆశ్రమ నిర్వాహకుల అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఆశ్రమంలోనే బస చేసిన శరానంద్ జీ మహారాజ్ ఆచూకీ తెలుసుకున్న పోలీసులు శుక బ్రహ్మ ఆశ్రమం నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
స్థానిక పోలీసుల సమాచారంతో ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన శిష్యులు పోలీసులు శుక బ్రహ్మ ఆశ్రమంలో షెడ్డులో ఉన్న స్వామిజీని చూసి చలించి పోయారు. మధుర ఆశ్రమంలో సౌకర్యవంతమైన వసతులు పొందిన స్వామిజీ శుక బ్రహ్మ ఆశ్రమంలో సాధారణ సాధువులా జీవనం గడపడం చూసి ఆవేదన చెందారు. మధుర ఆశ్రమానికి రావాలని శిష్యులు వేడుకున్నారు. ఆశ్రమం విడిచి మధుర కు వెళ్లేందుకు స్వామీజీ నిరాకరించిన స్వామీజీ శాంతి స్థాపన కోసం పోరాడి అలసిపోయానని, మనశ్శాంతి కావాలని, తిరిగి రావాలని బలవంతం చేయవద్దని స్వామీజీ చెప్పడంతో శిష్యులు ఏమీ చేయలేకపోయారు.
మధుర స్వామి మనసు మార్చుకుని తిరిగి వస్తారని శిష్యులు కూడా అక్కడే ఉండిపోయారు. శిష్యుల కోరిక మేరకు తిరిగి మధుర ఆశ్రమానికి వస్తానని చెప్పడంతో శిష్య బృందం సంతోషం వ్యక్తం చేసింది.
చిన్నవయసు లో బానరస్ వేద పాఠశాలలో శుక బ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతి స్వరూపానంద స్వామితో కలిసి అభ్యాసం చేశామని గుర్తుచేసుకున్న స్వామిజీ ముక్కంటి ఆలయ దర్శనం చేసుకొని చెన్నై మీదుగా ఢిల్లీకి వెళ్లారు శరానందజీ మహారాజ్ స్వామీజీ. అసలు స్వామిజీ ఎందుకు మధుర ఆశ్రమాన్ని వదిలి వచ్చాడన్న దానిపై సందేహాలు మాత్రం వీడటం లేదు. ప్రశాంతత కోసమే శ్రీకాళహస్తికి వచ్చారా..? లేక సకల సౌకర్యాలు ఉన్న ఆశ్రమాన్ని వదిలి రావడానికి కారణాలేంటి.. శ్రీకాళహస్తికి వచ్చి సాధారణ సాధువుగా ఎందుకున్నారన్న చర్చ మాత్రం అలాగే ఉంది..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..