AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalliki Vandanam: తల్లికి వందనంపై రెండో విడతపై బిగ్‌ అప్‌డేట్.. ఈ లిస్ట్‌లో పేరున్నవారికే డబ్బులు!

రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద రెండో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు సంబంధిత అధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

Thalliki Vandanam: తల్లికి వందనంపై రెండో విడతపై బిగ్‌ అప్‌డేట్.. ఈ లిస్ట్‌లో పేరున్నవారికే డబ్బులు!
Ap Thalliki Vandanam 2nd Phase Funds
Anand T
|

Updated on: Oct 10, 2026 | 5:26 PM

Share

ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద రెండో విడత లబ్ధిదారులను ఖరారు చేసింది. ఈ విద్యా సంవత్సరంలో తొలి విడత నిధులు విడుదల చేసిన తర్వాత, సాంకేతిక లేదా ఇతర కారణాలతో డబ్బులు జమకాని అర్హుల నుంచి ప్రభుత్వం వివరాలు, ఫిర్యాదులను స్వీకరించింది. అనంతరం క్షేత్రస్థాయిలో వారి అర్హతలను సమగ్రంగా పరిశీలించి, రెండో విడతలో వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగానే లబ్ధిదారుల నుంచి వచ్చిన దరఖాస్తులు, ఫిర్యాదులను పరిష్కరించిన అధికారులు.. రెండో దశలో 3,29,201 మందిని అర్హులుగా ఖరారు చేశారు. వీరికి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.10,208.69 ఆర్థిక సహాయాన్ని విడుదల చేయడానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.ఆ వివరాలను ఈ కింద పట్టికలో మీరు చూడవచ్చు.

Thalliki Vandanam

Thalliki Vandanam

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us