AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhimavaram: ఆ ఊర్లో పెళ్లి లేదు.. కానీ ఊరంతా పందిళ్లు వేశారు.. ఎందుకో తెలుసా!

తెలుగురాష్ట్రాల్లో రోజురోజుకు భానుడి ప్రతాపం పెరిగిపోతోంది. వేడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక ట్రాఫిక్‌లో నిలబడే వాహనదారుల పరిస్థితి అయితే వర్ణనాతీతం. కింద రోడ్డు వేడి..పైన ఎండవేడితో నిప్పుల కొలిమిలో ఉన్నట్టు ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు భీమవరంలో అధికారులు సరికొత్త ఆలోచన చేశారు. పట్టణంలో రైల్వే, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు వేసవి తాపాన్ని తట్టుకునేలా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.

Bhimavaram: ఆ ఊర్లో పెళ్లి లేదు.. కానీ ఊరంతా పందిళ్లు వేశారు.. ఎందుకో తెలుసా!
Bhimavaram
B Ravi Kumar
| Edited By: |

Updated on: May 02, 2025 | 12:11 PM

Share

సీతా రాముల కళ్యాణం చేసే సందర్భంలో ఊరంతా పందిరి, ముత్యాల తలంబ్రాలు అనే మాటలూ మనం వింటూనే ఉంటాము. ఇప్పుడెందుకు వీటి గురించి అనుకుంటున్నారా.. ఈ ఎండా కాలంలో మీరు ఒక్కసారి ఆంధ్రా లాస్ వెగాస్‌గా పిలువబడే భీమవరం వెలితే..మనను ఆ మాట గుర్తొస్తుంది. భీమవరంలో ఎంట్రీ నుంచి ఎండింగ్ దాకా.. మనకు గ్రీన్ మ్యాట్‌లతో వేసిన పందిళ్లు కనిపిస్తుంటాయి. ఇవి భోజనాలు పెట్టడానికో.. ఫంక్షన్‌ల కోసమో వేసినవి కాదు. ఈ సీజన్‌లో ఎండలు వేడిని తట్టుకోలేక రైల్వే లైన్ క్రాసింగ్ దగ్గర నిమిషాలు కొద్ది నిలబడలేక ఇలాంటి గ్రీన్ మ్యాట్ పందిళ్లు వేశారు అధికారులు

వేసవి కాలంలో ఎండ దెబ్బకు బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతారు. అలాంటిది వేసవి కాలంలో ప్రయాణం చేయాలంటే ఇక చమటలే. ఇక మనం వెళ్లే దారిలో ట్రాఫిక్ సిగ్నల్‌ గాని, రైల్వే సిగ్నల్‌ కాని ఉందంటే.. నరకం చూడాల్సిందే. ఒక్కొక్క సారి 5 నుండి 25 నిమిషాల పాటు రైల్వే గేటు తీసే వరకూ ఎండలో మాడుతూ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ దారుణమైన అనుభవాన్ని మనలో చాలా మంది అనుభవించే ఉంటాం. ముఖ్యంగా బైక్‌లపై ప్రయాణించే వారు ఈ ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి సరికొత్త ఆలోచన చేశారు. పట్టణంలో రైల్వే, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు వేసవి తాపాన్ని తట్టుకునేలా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.  పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మున్సిపల్ అధికారులు చేసిన ఈ పనికి వాహనదారులు, ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువగా ట్రాఫిక్ నిలిచిపోయే భీమవరం ఉండిరోడ్‌లోని రైల్వే గేటు, బైపాస్ రోడ్లలోని రైల్వే గేటు వద్ద భారీ స్థాయిలో చలువ పందిళ్ళు వేయించారు. ప్రయాణికులకు వడదెబ్బ, ఎండ తీవ్రత నుండి కాపాడడానికి తక్కువ ఖర్చుతో చలువ పందిళ్ళు వెయించామని, ఇవి అందిరికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆయన అంటున్నారు. ఎంత ఎండ తీవ్రత ఉన్న రైల్వే గేటు వద్దకు వచ్చేసరికి ప్రయాణికులు పందిళ్ళు కింది ఉపసమనం పొందుతున్నామని స్థానికులు చెబుతున్నారు. వాహనదారుల ఇబ్బందులను గుర్తించి చలువ పందిళ్లు ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..