AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్నెట్ టెక్నీషియన్ అంటూ వ్యాపారికి టోకరా.. ఇతని కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి..

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు జనాల నుంచి డబ్బులు కాజేసేందుకు కొత్త కొత్త వ్యూహాలను పన్నుతున్నారు. తాజాగా ఇంటర్నెట్‌ చెకింగ్‌ పేరుతో ఓ వ్యాపారి వద్దకు వచ్చిన ఓ కేటుగాడు ఏంగా రూ.24వేలు కాజేశాడు. సీసీ ఫుటేజ్‌ దృశ్యాల ద్వారా సదురు వ్యక్తిని గుర్తించి పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

ఇంటర్నెట్ టెక్నీషియన్ అంటూ వ్యాపారికి టోకరా.. ఇతని కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి..
Mobile Banking Fraud In Tenali
T Nagaraju
| Edited By: |

Updated on: Oct 20, 2026 | 2:15 PM

Share

తెనాలిలో సరికొత్త ఆన్ లైన్ మోసానికి తెర తీశాడో యువకుడు. పట్టణంలోని పాత బజాజ్ షోరూం పక్కన రాజేష్ అనే యువకుడు డ్రై ప్రూట్స్ షాప్ నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం తను షాపులో ఉండగా ఒక యువకుడు టూల్ కిట్ పట్టుకొని షాపు ముందు తిరిగాడు. షాపు ఎదురుగా ఉన్న స్తంభం వద్ద రిపేర్ చేస్తున్నట్లు నటించాడు. కొద్దీసేపటి తర్వాత రాజేష్ షాపులోకి వచ్చాడు. ఇంటర్నెట్ వస్తుందా అని అడిగాడు. చెక్ చేసిన రాజేష్ నెట్ రావడం లేదని తెలిపాడు. వెంటనే ఆ యువకుడు మీ మెబైల్ ఇవ్వండని అడిగాడు. రాజేష్ తన మొబైల్ ను ఆ యువకుడికి అప్పగించాడు. సెట్టింగ్స్ మారుస్తున్నట్లు నటించిన యువకుడు మొబైల్ ఫోన్ తిరిగి ఇచ్చేశాడు. అక్కడ నుండి యువకుడు వెళ్లిపోయాడు.

అయితే అప్పటి వరకు తన బిజినెస్‌లో పడిపోయిన రాజేష్ కొన్ని గంటల తర్వాత తన అకౌంట్ చెక్ చేసుకున్నాడు. తన ఖాతా నుండి 24 వేల రూపాయలు డ్రా అయినట్లు గుర్తించాడు. వెంటనే బ్యాంక్ కు వెళ్లి వివరాలు తెలుసుకున్నాడు. హైదరాబాద్ లోని చైతన్య గ్రామీణ బ్యాంక్ లోని మహిళ ఖాతలో ఈ డబ్బులు జమ అయినట్లు బ్యాంక్ అధికారులు చెప్పారు.

దీంతో ఇంటర్నెట్ రిపేర్ పేరుతో వచ్చిన యువకుడే తన డబ్బులు డ్రా చేసినట్లు రాజేష్ గుర్తించాడు. అసలు నెట్ రిపేరే రాలేదని.. వచ్చిన యువకుడే నెట్ వైర్ కట్ చేసి షాపులోకి వచ్చి నెట్ వస్తుందా లేదా అంటూ ప్రశ్నించినట్లు గుర్తించాడు. తన దగ్గరకు వచ్చి మొబైల్ తీసుకొని డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకున్నట్లు తెలుసుకున్నాడు.

ఇక వెంటనే అప్రమత్తమై తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేయాలని విజ్నప్తి చేశాడు. పోలీసులు బిజిగా ఉండటంతో కేసు నమోదు చేయలేదు. దీంతో సదరు యువకుడి పట్ల స్థానికులు అప్రమత్తంగా ఉండాలని వ్యాపారి రాజేష్ చెప్పాడు. చిన్న మొత్తంలోనే తన వద్ద నుండి డబ్బులు డ్రా చేసుకున్న ఇంకా ఎంతమంది వద్ద నుండి డబ్బులు అలా తీసుకుంటున్నాడో తెలియదంటున్నాడు రాజేష్.. ఇప్పటికైనా సిసి విజువల్స్ ద్వారా ఆ యువకుడిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజేష్ కోరుతున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us