Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నారా లోకేష్ లేఖ.. ఇంతకీ ఆ లేఖలో ఆయన ఏం కోరారంటే..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నారా లోకేష్ లేఖ.. ఇంతకీ ఆ లేఖలో ఆయన ఏం కోరారంటే..
Nara Lokesh
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 18, 2021 | 3:15 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు లేదా వాయిదా వేయాలని ముఖ్యమంత్రిని కోరారు. జూన్‌ నెలలో ఏపీలో 15 లక్షలకు పైగా విద్యార్థులు 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉందన్నారు. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. వేచి చూసే ధోరణి కంటే.. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం చాలా ఉత్తమం అని లేఖలో పేర్కొన్నారు. ఏపీలో టీకా పంపిణీ తక్కువగా జరుగుతున్న సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం తగదన్నారు. పరీక్షల వల్ల కోవిడ్ సోకితే కొందరు విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న అనిశ్చితి, ఆందోళన, ఒత్తిడిని నివారించడానికి పరీక్షలను రద్దు చేయటమే ఉత్తమ మార్గం అని ముఖ్యమంత్రికి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దేశ వ్యాప్తంగా తీవ్రంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసుల తీవ్రత రోజు రోజుకూ ఎక్కువ అవతుండటంతో పాటు.. మరణాల రేటు కూడా పెరుగుతోందని లోకేష్ తాను రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో పడకలు ఖాళీ లేకపోవడం, వెంటిలేటర్ల కొరత అధికంగా ఉందన్నారు. గత వారం రోజుల్లో రాష్ట్రంలో రోజుకు సగటున 3000 కొత్త కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ప్రజలు కోవిడ్ బారిన పడకుండా నివారించవచ్చునని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. రాష్ట్రంలో టీకా సామర్ధ్యం పెరిగే వరకు కరోనా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం ఇప్పటికే సిబిఎస్‌ఇ పరీక్షలను రద్దు చేసిందని లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వమూ పదో తరగతి, ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రద్దు చేసిందని, ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు వాయిదా వేసిందని ఉటంకించారు.

Also read:

AP Weather Report: ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. రాగల మూడు రోజులు ఏపీలో వాతావరణం ఎలా ఉండనుందంటే..

Coronavirus: ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కీలక ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్..