Jangareddygudem: ప్రత్యేక పాఠ్యపుస్తకాలు ఇస్తానని టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థినిని రూమ్‌కి పిలిచిన టీచర్.. ఆ తర్వాత
ప్రభుత్వ పాఠశాలలో ఫెయిల్ అయిన పలువురు విద్యార్థులు దీనికి హాజరయ్యారు. క్లాసు ముగిసిన అనంతరం మీసాల శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు ఒక విద్యార్థినికి స్పెషల్ నోట్స్ ఇస్తానని రమ్మంటూ రూమ్‌లోకి తీసుకెళ్లాడు.
AP News: కరోనా(Coronavirus), ఇతరత్రా కారణాల వల్ల ఈ ఏడాది ఏపీలో టెన్త్ క్లాస్ పాస్ పర్సెంటేజ్ తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కండెక్ట్ చేస్తున్నాయి కొన్ని స్కూల్స్. అయితే ఇలా చదువుకునేందుకు వచ్చిన ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు ఓ ఉపాధ్యాయుడు. ఈ ఘటన జంగారెడ్డిగూడెం జడ్పీ హైస్కూల్‌లో చోటు చేసుకుంది. విద్యార్థిని బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్‌కు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 13 నుంచి స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ఫెయిల్ అయిన పలువురు విద్యార్థులు దీనికి హాజరయ్యారు. క్లాసు ముగిసిన అనంతరం మీసాల శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు ఒక విద్యార్థినికి స్పెషల్ నోట్స్ ఇస్తానని రమ్మంటూ రూమ్‌లోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి యత్నించాడు. దీంతో తను ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో కీచక టీచర్ గురించి చెప్పింది. దాంతో ఆగ్రహం చెందిన బంధువులు స్కూల్‌కు వెళ్లి ఉపాధ్యాయుడుని కడిగిపారేశారు. దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే అదే ఉపాధ్యాయుడిపై జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురంలో పనిచేసినప్పుడు కూడా ఇదే తరహాలో ఆరోపణలు వచ్చాయి. తాజా ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..