AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: ఇదేందిది మాస్టారూ.! పాఠాలు చెప్పాల్సిన మీరే పిచ్చి వేషాలు వేస్తే ఎలా.. చిన్న పిల్లలని కూడా..

పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ బడి పంతులు దారి తప్పాడు. కూతుళ్ల వయసు ఉండే బాలికలతో వెకిలి వేషాలు వేశాడు. క్లాస్ రూమ్‌లోనే..

AP: ఇదేందిది మాస్టారూ.! పాఠాలు చెప్పాల్సిన మీరే పిచ్చి వేషాలు వేస్తే ఎలా.. చిన్న పిల్లలని కూడా..
Representative Image
Ravi Kiran
|

Updated on: Apr 30, 2022 | 11:28 AM

Share

పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ బడి పంతులు దారి తప్పాడు. కూతుళ్ల వయసు ఉండే బాలికలతో వెకిలి వేషాలు వేశాడు. క్లాస్ రూమ్‌లోనే వికృత చేష్టలతో నరకం చూపించాడు. అభం శుభం తెలియని విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో వెలుగుచూసింది ఈ ఘటన

చిల్లగుండ్ల పల్లి ప్రాథమిక పాఠశాలలో 58 ఏళ్ల అబు అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నట్టు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. బాలికలపట్ల పైశాచికంగా ప్రవర్తిస్తూ… తన వికృత చేష్టలతో భయపెడుతున్నాడంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే టీసీ ఇస్తానని బెదిరిస్తున్నాడంటూ వాపోయారు.. అక్కడితో ఆగకుండా చాక్‌పీసుకు ఓ తాడు ముడివేసి.. ఈ తాళి కట్టేస్తానంటూ దారుణంగా ప్రవర్తిస్తున్నాడట.. దువ్వెనతో వారి తలలు దువ్వి, పౌడర్‌ రాసి, బొట్టు బిళ్లలు పెట్టేవాడని చిన్నారులు భయపడుతూ చెబుతున్నారు.

తల్లిదండ్రులు, స్థానికులు, గ్రామ సర్పంచ్ ద్వారా కలెక్టరు హరినారాయణన్‌‌కు ఫిర్యాదు చేశారు. ఆయన సీరియస్‌గా స్పందించి విచారణకు ఆదేశించారు. టీచర్ అరాచకాలను చిత్తూరు ఆర్డీవో, డీఈవో, ఎంఈవో, తహసీల్దారు, ఎంపీడీవో, స్థానికుల ముందు చెప్పి బాలికలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన డీఈవో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అలాగే అతడిపై పోక్సో కేసు నమోదుచేసి తక్షణమే అరెస్టు చేయాలని పోలీసుల్ని ఆదేశించారు. ఈ విషయం తెలియడంతో ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.