Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో ‘దోమల’ పంచాయితీ..! రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ఏం చేశారంటే..?
Rajahmundry Central Prison: టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ.. ఓ వైపు ఆరోపణలు.. మరోవైపు ప్రతిఆరోపణలు.. దీంతో ఏపీ రాజకీయాల్లో మాటల మంటలు కొనసాగుతున్నాయి.. కారణం ఏంటో తెలుసా.? దోమలు.. అసలు దోమలకు రాజకీయాలకు సంబంధం ఏంటి..? అనుకుంటున్నారా..? అయితే, ఈ స్టోరీ చదవాల్సిందే.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ నేటికి 19వ రోజుకు చేరింది

Rajahmundry Central Prison: టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ.. ఓ వైపు ఆరోపణలు.. మరోవైపు ప్రతిఆరోపణలు.. దీంతో ఏపీ రాజకీయాల్లో మాటల మంటలు కొనసాగుతున్నాయి.. కారణం ఏంటో తెలుసా.? దోమలు.. అసలు దోమలకు రాజకీయాలకు సంబంధం ఏంటి..? అనుకుంటున్నారా..? అయితే, ఈ స్టోరీ చదవాల్సిందే.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ నేటికి 19వ రోజుకు చేరింది. ఓ వైపు చంద్రబాబుకు బెయిల్ కోసం ఆయన తరుపు న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర కోర్టులతోపాటు.. సుప్రీంకోర్టుకు కూడా ఆశ్రయించారు. మరోవైపు చంద్రబాబు చుట్టూ అంగళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారం కేసులు వెంటాడుతున్నారు. ఈ క్రమంలోనే కస్టడీని పొడగించాలంటూ సీఐడీ ఏసీబీ కోర్టును కోరుతోంది.
ఈ క్రమంలో ఈ నెల 11 నుంచి సెంట్రల్ జైల్లోని ప్రత్యేక బ్యారక్‌లో ఉన్న చంద్రబాబుకు సరైన వసతులు కల్పించడం లేదని, దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ ఆయన భార్య భువనేశ్వరి, టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు పలుమార్లు ఆరోపించారు. ఇటీవల కాలంలో ఇదే జైలులో రిమాండ్‌లో ఉన్న ఓ ఖైదీ డెంగ్యూతో ప్రాణాలు కోల్పోవడంతో.. చంద్రబాబు భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. జైల్లో దోమల బెడద ఎక్కువగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబును దోమలు కుడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు పెద్దఎత్తున ఆరోపణలు చేశారు.
దీంతో ఏపీ రాజకీయ వేడి కాస్త దోమల వైపు మళ్లింది.. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు దోమల నియంత్రణకు చర్యలు చేపట్టారు. జైలు చుట్టూ అధికారులు పెద్దఎత్తున దోమల ఫాగింగ్ చేయించారు. దోమల బెడద తగ్గించడానికి ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమం చేపట్టారు. గడిచిన 18 రోజుల్లో ఎన్నడూ లేనివిధంగా అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. సెంట్రల్ జైలు చుట్టూ పెద్ద సంఖ్యలో వృక్షాలు, మొక్కలు ఉండడంతో దోమల బాధ ఎక్కువగా ఉంటుందని, అందుకే ఖైదీల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైలు సిబ్బంది చెబుతున్నారు. జైలు ప్రాంగణంతోపాటు.. పరిసరాల్లోని చెట్లు పుట్టలు, పొదల్లో కూడా మున్సిపల్ సిబ్బంది ఫాగింగ్ కార్యక్రమం చేపట్టారు.
ఇదిలాఉంటే.. చంద్రబాబు రోజువారి దినచర్యలో భాగంగా.. కోర్టు ఆదేశాల ప్రకారం రోజుకి నాలుగు సార్లు ఇంటినుంచి అల్పాహారం, భోజనం, స్నాక్స్‌ను ఆయన సిబ్బంది తీసుకెళ్లి ఇస్తున్నారు. స్కిల్ డవలప్మెంట్ కేసులో ఈనెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు.. రిమాండ్ 19 రోజుకు చేరింది. దీంతో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమండ్రి టీడీపీ క్యాంప్ శిబిరంలోనే బస చేస్తూ.. 19 రోజులుగా చంద్రబాబుకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఈనెల 15వ తేదీ నుంచి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన రేపు ఢిల్లీనుంచి వచ్చి మళ్లీ యువగళం పాదయాత్రను ప్రారంభించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
