లోకేష్, వైసీపీ నేతల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. కొడాలి నానిపై లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి. మరోవైపు లోకేష్ వ్యాఖ్యలను ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. అసలు టీడీపీకి భవిష్యత్తే లేదంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. నారా లోకేష్ చేసేది యువగళం యాత్ర కాదన్నారు. 2024 తర్వాత ఎన్టీఆర్ నిజమైన వారసులు వస్తారన్నారు కొడాలి నాని.
లోకేష్, అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎంపీ విజయసాయిరెడ్డి. వారి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదన్నారు విజయసాయిరెడ్డి. ఓట్ల తొలగింపుపై టీడీపీది తప్పుడు ప్రచారమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్లను గుర్తించి తొలగిస్తే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. దొంగే.. ‘దొంగ దొంగ’ అన్నట్లు ఉందని, టీడీపీ అసలు స్వరూపం అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.
మరోవైపు లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలోముగించుకొని ఏలూరు జిల్లాలోకి అడుగుపెడుతుంది. ప్రభుత్వ తీరుతో పరిశ్రమలు వెనక్కి వెల్లిపోతున్నాయంటూ గన్నవరం నియోజకవర్గంలో పెట్టిన రచ్చబండ కార్యక్రమంలో విమర్శించారు లోకేష్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..