AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kesineni Nani: టీడీపీ ఎంపీ కేసినేని నాని సిబ్బంది నిప్పులు.. సోషల్ మీడియాలో టాపిక్‌ను వైరల్ చేసిన వాళ్లపై ఆగ్రహం

టీడీపీ ఎంపీ కేసీనేని నాని తెలుగు దేశం పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారంటూ వస్తోన్న ప్రచారాలను కేశినేని ఆఫీస్ సిబ్బంది తీవ్రంగా ఖండించారు. టాటా ఫోటోలు పెట్టాం తప్ప

Kesineni Nani: టీడీపీ ఎంపీ కేసినేని నాని సిబ్బంది నిప్పులు..  సోషల్ మీడియాలో టాపిక్‌ను వైరల్ చేసిన వాళ్లపై ఆగ్రహం
Kesineni Nani
Venkata Narayana
|

Updated on: Oct 18, 2021 | 11:01 AM

Share

TDP MP Kesineni Nani: టీడీపీ ఎంపీ కేసీనేని నాని తెలుగు దేశం పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారంటూ వస్తోన్న ప్రచారాలను కేశినేని ఆఫీస్ సిబ్బంది తీవ్రంగా ఖండించారు. టాటా ఫోటోలు పెట్టాం తప్ప.. టీడీపీని పక్కకు పెట్టేలా ఫోటోలు తీసేయలేదని వివరణ ఇచ్చారు. లోపల ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలున్నాయన్నారు. బయట భారీ ఫ్లెక్సీలున్నాయి. ఇవన్నీ లేనిపోని ఊహాగానేలే.. అసత్య ప్రచారాలంటూ ఖండిస్తున్నారు ఆఫీస్ సిబ్బంది. సోషల్ మీడియాలో టాపిక్‌ను వైరల్ చేసిన వాళ్లపై సిబ్బంది నిప్పులు కక్కుతున్నారు.

కాగా, ఇవాళ బెజవాడ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. తెలుగు దేశంలో స్ట్రాంగ్ అనుకున్న లీడర్. ఆరునూరైనా గెలిచి తీరే కసి ఉన్న నేత, మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కేశినేని ఇప్పుడు టీడీపీ జెండా పీకేస్తున్నారన్నదే ఆ హాట్ టాపిక్. అవును, కేశినేని నాని క్యాంప్ కార్యాలయంలో ఇన్నాళ్లూ ఉన్న చంద్రబాబు ఫోటోలు ఇప్పుడు లేవు. ఆ ప్లేస్‌లో రతన్‌ టాటా ఫోటోలు వెలిశాయి. తన ఎంపీ నియోజకవర్గంలో ఏడుగురు ఇంచార్జ్‌లతో కలిసి ఉన్న ఫోటోలు కూడా పోయి.. ఐదేళ్లలో తాను టాటా ట్రస్ట్ తరఫున చేసిన సేవా కార్యక్రమాల ఆనవాళ్లు గోడలపై ప్రత్యక్షమయ్యాయి.

సేవే పరమావధి అనుకున్నా.. చంద్రబాబు, టీడీపీ నేతల ఫోటోలు పీకేయాల్సిన పనిలేదు. కానీ వాటిని తొలిగించి మరీ కొత్త ఫోటోలు పెట్టారంటే.. తాను రాజకీయాలకు దూరం అని సంకేతాలిస్తున్నారా? కాదంటే.. టీడీపీకి మాత్రమే దూరం అని చెప్పదలచుకున్నారా? బెజవాడ సహా ఏపీలో ఇప్పుడో కొత్త చర్చ ఏంటంటే.. నానీ బీజేపీలోకి జంప్ అవుతున్నారని. ఇప్పటికే కమలం పెద్దలతో చర్చలూ ముగిశాయంటున్నారు. ఈ పడవ నుంచి కాలు ఆ పడవలో పెడితే పదవి కూడా దక్కొచ్చని జోస్యం చెబుతున్నారు. వీటిల్లో ఏది నిజమో చెప్పాలసింది మాత్రం నానీనే.

కాగా, విజయవాడ మున్సిలప్ కార్పొరేషన్‌ ఎన్నికల టైమ్ నుంచీ లోకల్ తెలుగు దేశంలో కొన్ని లుకలుకలు కనిపించాయి. ఆయన కుమార్తె శ్వేతను కార్పొరేషన్ చైపర్సన్ అభ్యర్థిగా ఓకే చేయించుకోడానికి కూడా అనేక డక్కాముక్కీలు తినాల్సి వచ్చింది. అప్పట్లో దేవినేని గ్రూప్‌, కేశినేని గ్రూప్ అంటూ రెండు వర్గాలు బెజవాడ టీడీపీని దెబ్బతీస్తున్నాయనే టాక్ కూడా వచ్చింది. ఆ తర్వాత అంతా ఒక్కటయినట్లు కనిపించినా.. లోలోన ఫైర్ మాత్రం అలాగే ఉందన్నది తాజాగా ఫోటోల మ్యాటర్ చెబుతున్న సీన్.

కొన్నాళ్ల నుంచి పార్టీకి, పార్టీ అధిష్టానానికి అంటీముట్టనుట్లు ఉన్న కేశినేని తాను ఇక పోటీ చెయ్యనని చెప్పేశారు. నెక్ట్స్ ఎలక్షన్‌ టైమ్‌కి తన ప్లేస్‌లో మరో కొత్త లీడర్‌ను సెలక్ట్ చేసుకోవాలని కూడా సూచించారు. అయినా కూడా అధిష్టానం తనను బుజ్జగించే ప్రయత్నం కూడా చెయ్యలేదన్న బాధ కేశినేనిలో ఉందన్నది ఆయన సన్నిహితులు చెబుతున్నమాట. మరోవైపు బీజేపీతో చర్చలు జరిగాయని, కేంద్రంలో పదవి ఉందంటూ వస్తున్న ఊగాహానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మొత్తంగా అలకో, ఆఫరో గానీ.. కేశినేని బస్సు వెళ్లిపోతున్నట్లు పక్కా సిగ్నల్ ఇచ్చేసేరనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న మాట.

Read also: AP and Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..