TDP Mahanadu: టీడీపీ ‘మహానాడు’కు సర్వం సిద్ధం.. ప్రవేశపెట్టనున్న తీర్మానాలు ఇవే..

వైసీపీ తలపెట్టిన సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర ఒక నాటకం అని పొలిట్ బ్యూరో వ్యాఖ్యానించింది. ఏ వర్గానికి ఏం చేశారని సామాజిక న్యాయం అని యాత్ర చేస్తున్నారని నేతలు ప్రశ్నించారు.

TDP Mahanadu: టీడీపీ 'మహానాడు'కు సర్వం సిద్ధం.. ప్రవేశపెట్టనున్న తీర్మానాలు ఇవే..
Tdp Mahanadu
Follow us

|

Updated on: May 27, 2022 | 9:58 AM

TDP Mahanadu: టీడీపీ(TDP) ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మహానాడులో భాగంగా ఇవాళ ఉదయం 9.30 నిముషాలకు ప్రతినిధుల సమావేశం ప్రారంభం అవుతుంది. మహానాడు(Mahanadu)లో ప్రవేశపెట్టే తీర్మానాలకు ఇప్పటికే పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 17 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వాటిలో ఏపీ(AP)కి సంబంధించి 12 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి 3 తీర్మానాలు, అండమాన్‌కు సంబంధించి ఒక తీర్మానం ఉంటుంది. వీటితో పాటు రాజకీయ తీర్మానం కూడా ఉంటుంది. తీర్మానాలపై దాదాపు 50 మంది మాట్లాడే అవకాశం ఉంది. ఆయా తీర్మానాలు ప్రజల్లోకి వెళ్లేలా మహానాడు చర్చలు సాగాలని నేతలు అభిప్రాయ పడ్డారు.

ఇకపోతే వైసీపీ తలపెట్టిన సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర ఒక నాటకం అని పొలిట్ బ్యూరో వ్యాఖ్యానించింది. ఏ వర్గానికి ఏం చేశారని సామాజిక న్యాయం అని యాత్ర చేస్తున్నారని నేతలు ప్రశ్నించారు. వైసీపీకి మొత్తం 9 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే అందులో నలుగురు రెడ్డి వర్గానికి చెందిన వారే ఉన్నారని టీడీపీ ఆరోపించింది. 9 మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు బయట రాష్ట్రాలకు చెందిన వారు కాగా.. ముగ్గురు జగన్‌తో పాటు కేసుల్లో ఉన్న వారే ఉన్నారు. లాబీయింగ్ చేసేవారికి, కేసుల్లో సహ మద్దాయిలకు జగన్ రాజ్యసభ ఇచ్చారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో 12 బీసీ కులాలను బీసీల జాబితా నుంచి తొలగిస్తే నోరెత్తని ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ ఇవ్వడం ఏరకంగా సమంజసమని టీడీపీ ప్రశ్నిస్తోంది. మైనారిటీలకు రిజర్వేషన్ల విషయంలో కోర్టుకు వెళ్లి అడ్డుపడిన ఆర్ కృష్ణయ్య తప్ప.. ఏపీలో బీసీ నేతలే లేరా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి ఒక్కరికి కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని పొలిట్ బ్యూరో ప్రశ్నించింది. వీటన్నింటిపైనా మహానాడులో చర్చ జరగనుంది.