AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paritala Sriram: సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కొట్టిస్తారా.. కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేదీలేదుః పరిటాల శ్రీరామ్

పోలీసుల తీరుపై ధర్మవరం నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Paritala Sriram: సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కొట్టిస్తారా.. కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేదీలేదుః పరిటాల శ్రీరామ్
Paritala Sriram
Balaraju Goud
|

Updated on: Apr 20, 2022 | 12:55 PM

Share

Paritala Sriram Comments: పోలీసుల తీరుపై ధర్మవరం నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులతో కొట్టిస్తారా అని ప్రశ్నించారు. రేపటి నుంచి నేనే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతా నన్ను కొట్టించు చూస్తా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అవసవరంగా టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేదీలేదన్నారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుడి భూదందాలు, రియల్ ఎస్టేట్ వ్యవరాలు బయట పెట్టాల్సి వస్తుందన్నారు.పోలీసులు 41నోటీస్ లేకుండా స్టేషన్ కు ఎలా తీసుకెళ్తారని పరిటాల ప్రశ్నించారు.

ఇప్పడప్పుడే ఎన్నికలు లేనప్పటికీ అనంతపురంలో రాజకీయాలు వేడెక్కాయి. ఓ వ్యక్తిని పోలీసులు విచారణ పేరుతో చితకబాదడం రాజకీయ దుమారానికి కారణమైంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి రామచంద్రా రెడ్డిపై పోస్టులు పెట్టారంటూ వాసుదేవను పోలీసులు అదుపులోకి తీసుకుని చితకబాదారని ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇటీవల ఫార్వర్డ్ మెసేజ్‌లు పోస్టు చేశారు వాసుదేవ. దీనిపై వైసీపీకి చెందిన కార్యకర్తలు, నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాసుదేవను పోలీసులు అరెస్ట్ చేశారని, విచారణ .

హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం TDP సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న వాసుదేవ.. పార్టీ కార్యక్రమాలను చురుకుగా ప్రచారం చేస్తున్నారు. అంతే ధీటుగా అధికార పార్టీ తీరుపై విమర్శలతో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ క్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డికి వ్యతిరేకంగా వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేశాడు వాసుదేవ. దీంతో అతన్ని విచారణ పేరుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, తనను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి, కొట్టినట్టు వాపోతున్నారు వాసుదేవ. స్థాయికి తగిన పోస్టులు పెట్టాలంటూ పోలీసులు కొట్టారని ఆరోపించాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాసుదేవను టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పరామర్శించారు.

ఇదిలావుంటే, అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో గత కొంత కాలంగా ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఈ నియోజకవర్గ రాజకీయాలు అంతగా హైలైట్ అయ్యేవి కాదు.. కానీ ఎప్పుడైతే పరిటాల శ్రీరామ్ నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారో అప్పటినుంచి సీన్ మారిపోయింది. అయితే మొదట్లో శ్రీరామ్ అంత దూకుడుగా పనిచేయలేదు. దీంతో ధర్మవరంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డికి తిరుగులేదన్నట్లు పరిస్తితి ఉండేది. పైగా ఆయన ప్రజల మధ్యలో ఎక్కువగా తిరుగుతారు. వారి సమస్యలని తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించడానికి చూస్తారన్న టాక్ కూడా ఉంది.

అంతేకాదు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వన్‌సైడ్‌గా గెలిచేసింది. దీంతో టీడీపీ పని అయిపోయిందన్నట్లు పరిస్తితి వచ్చింది. కానీ నిదానంగా ఇక్కడ పరిటాల శ్రీరామ్ పుంజుకున్నారు. టీడీపీ బాధ్యతలని చూసుకుంటున్న శ్రీరామ్.. దూకుడుగా రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశారు. కేతిరెడ్డికి ఎలాగైనా చెక్ పెట్టాలనే దిశగా పనిచేస్తున్నారు. ఇలా కేతిరెడ్డిని టార్గెట్‌గా ముందుకెళుతున్నారు. నియోజకవర్గంలో పట్టుసారించేందుకు పరిటాల శ్రీరామ్ పావులు కదుపుతున్నారు.

Read Also…  Chandrababu Birthday: దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు.. ప్రజల పక్షాన పోరాడేందుకు శక్తినివ్వమని కోరిన బాబు