AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Lokesh: “ఇక పోటీ నుంచి తప్పుకుంటా”.. మహానాడులో లోకేశ్ సంచలన ప్రకటన

ఒంగోలు(Ongole) వేదికగా జరుగుతున్న మహానాడులో టీడీపీ లీడర్ నారా లోకేశ్(Nara Lokesh) సంచలన ప్రకటన చేశారు. మూడు సార్లు వరసగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఈ సారి జరిగే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదనే...

Nara Lokesh: ఇక పోటీ నుంచి తప్పుకుంటా.. మహానాడులో లోకేశ్ సంచలన ప్రకటన
Lokesh
Ganesh Mudavath
|

Updated on: May 27, 2022 | 6:50 PM

Share

ఒంగోలు(Ongole) వేదికగా జరుగుతున్న మహానాడులో టీడీపీ లీడర్ నారా లోకేశ్(Nara Lokesh) సంచలన ప్రకటన చేశారు. మూడు సార్లు వరసగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఈ సారి జరిగే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదనే అంశంపై చర్చిస్తున్నామన్నారు. ఈ విధానాన్ని తన నుంచే ప్రారంభిస్తానని వెల్లడించారు. “పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు చేశాను. ఈ సారి తప్పుకొని వేరొకరికి అవకాశం ఇస్తా. పార్టీలో 2+1 విధానం రావాలి. రెండుసార్లు ఒక పదవిలో ఉన్న వారికి విరామం ఇవ్వాలి” అని లోకేశ్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 నియోజకవర్గాల్లో పార్టీకి సరైన అభ్యర్థులను నియమించాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ నేతలకు దీర్ఘకాలం పదవుల విధానం రద్దు ప్రతిపాదనను పెట్టానని చెప్పారు. మహానాడు తర్వాత రెండు పెద్ద కుంభకోణాలు బయట పెట్టబోతున్నానన్న లోకేశ్.. డబ్బుతోనే రాజకీయం చేయలేమని పేర్కొన్నారు.

ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తాం. ఈ లోగా కొంతమంది అభ్యర్థులకు స్పష్టత ఇచ్చేస్తాం. పార్టీ అధికారంలోకి రాగానే కీలక మార్పులు తీసుకొస్తాం. మంత్రులు పార్టీకి రిపోర్ట్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ తగ్గించేందుకే ప్రయత్నాలు చేస్తాం.

        – లోకేశ్‌, టీడీపీ లీడర్

ఇవి కూడా చదవండి

మరోవైపు మహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని మండిపడ్డారు. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందన్న చంద్రబాబు.. రాజకీయం అంటే తమాషా కాదని అన్నారు. గత 40 ఏళ్లలో టీడీపీ ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక ఎత్తయితే.. ఈ మూడేళ్లలో వచ్చిన ఇబ్బందులు మరో ఎత్తని చంద్రబాబు అన్నారు. వైసీపీ(YCP) తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని.. ఎవరు తప్పు చేసినా వదిలేది లేదని హెచ్చరించారు.

ప్రజా సమస్యలపైనే తమ పోరాటం కొనసాగుతుందన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరి వేసే పరిస్థితి తీసుకొస్తారా అంటూ ప్రశ్నించారు. మీటర్లు పెడితే భవిష్యత్తులో చాలా నష్టం వస్తుందని హెచ్చరించారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేరని.. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..