AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: ఆంధ్రా యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్‌ వెనుక ఉన్న పొదల్లో మినీ డెన్.. చెక్ చేస్తే మైండ్ బ్లాంక్

ఆంధ్రావర్శిటీలో మంచెల మాటున డ్రగ్స్‌ వాడకంపై అనుమానాలు వ్మక్తమవుతున్నాయి. యూనివర్శిటీలోని చెట్లుచేమ మాటన కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. బయటకు కనిపించని స్థావరాల్లో రహస్యంగా మీనీ డెన్ ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది.

AP: ఆంధ్రా యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్‌ వెనుక ఉన్న పొదల్లో మినీ డెన్.. చెక్ చేస్తే మైండ్ బ్లాంక్
Au Hostel Den
Ram Naramaneni
|

Updated on: May 27, 2022 | 7:04 PM

Share

ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ(Andhra University), ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. AU ఇంజినీరింగ్‌ కాలేజ్‌ బాయ్స్ హాస్టల్‌ వెనుక ఉన్న పొదల్లో, ఏకంగా ఓ మినీ డెన్‌నే ఏర్పాటు చేసి వ్యభిచారం, మందు పార్టీలు నిర్వహించడం కలకలం రేపుతోంది. వర్సిటీ సుందరీకరణ పనుల కోసం హాస్టల్ వెనుక పొదల్ని తొలగించి ఆ ప్రాంతం శుభ్రం చేస్తుంటే, ఈ బాగోతం బయటపడింది. వెదురు చెట్లు దట్టంగా పెరగడంతో ఆ చెట్లపైనే ఓ మంచె ఏర్పాటు చేసేశారు కంత్రీగాళ్లు. వాటిపై ఏకంగా పరుపులు వేశారు. పైకి ఎక్కడానికి నిచ్చెన పెట్టి పని కానిస్తున్నారు. దట్టమైన పొదలు ఉండటంతో, అక్కడేం జరుగుతుందో బయటకు తెలియలేదు. ఇదే అదునుగా దీన్నో వ్యభిచార కేంద్రంగా మార్చినట్టు తెలుస్తోంది. ఆ పొదల్లో ఎక్కడ చూసినా కండోమ్‌లు, సిగరెట్‌ ప్యాకెట్లు, మందు బాటిళ్లే కనిపించాయి. ఈ పొదల దగ్గర కొన్ని వందల కండోమ్ ప్యాకెట్లు దొరికాయి అంటే, ఇక్కడేం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పొదల దగ్గర మద్యం బాటిళ్లతోపాటు కొన్ని సిరెంజ్‌లు దొరకడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వీటన్నిటిని చూసి అవాక్కయ్యారు వర్సిటీ అధికారులు. ఈ వ్యవహారం వెనుక పెద్ద నెట్‌వర్క్‌ ఉందని అనుమానిస్తున్నారు.

డ్రగ్స్ ఇంజెక్షన్లను తీసుకునేందుకే వీటిని ఉపయోగించారా, లేక ఈ ప్రాంతం డ్రగ్స్‌ దందాకి అడ్డాగా మారిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏజెన్సీ నుంచి విచ్చలవిడిగా వస్తున్న గంజాయి, డ్రగ్స్‌ ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది ఇన్నాళ్లూ దీన్ని ఎందుకు గుర్తించలేకపోయారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే, ఈ సెటప్ అరేంజ్‌ చేసింది ఎవరు? ఎవరెవరికి సంబంధం ఉంది అనేదానిపై విచారణ చేస్తున్నారు అధికారులు. క్యాంపస్‌లోకి వందలాది మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి? గుట్టల కొద్దీ కండోమ్ ప్యాకెట్స్‌ దొరకడం ఏంటి? డ్రగ్స్ సిరెంజ్‌లు పడి పడిఉన్నాయంటే అసలేం జరుగుతోంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Au Den

ఆ ప్రాంతంలో గుట్టగా పడేసిన కండోమ్ ప్యాకెట్లు

మరిన్ని ఆంధ్ర వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!