Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. హార్ట్, పల్స్ రేట్ డౌన్
ల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. 'జగనన్న మాట - కోటంరెడ్డి బాట' ప్రోగ్రామ్‌లో ఉండగా కోటంరెడ్డికి గుండెలో నొప్పి వచ్చింది. వెంటనే సహచరులు ఆయనను నెల్లూరు అపోలో హాస్పిటల్‌కి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం చెన్నై అపోలో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
Nellore District: నెల రోజులకు పైగా ‘జగనన్న మాట – కోటంరెడ్డి బాట’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( Kotamreddy Sridhar Reddy). ఈ ప్రోగ్రాంలో భాగంగా మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రతి గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుంటున్నారు. ఇవాళ ఆమంచర్ల గ్రామంలోని అరుంధతి వాడలో పర్యటిస్తుండగా కోటంరెడ్డికి ఒక్కసారిగా గుండెలో నొప్పి వచ్చింది. ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. నడవలేకపోయారు. వెంటనే సహచరులు ఆయనను నెల్లూరు అపోలో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు వెంటనే కోటంరెడ్డికి పరీక్షలు నిర్వహించారు. ఆయనకు హార్ట్ రేట్ పెరిగి, బీపీ డౌన్ అయినట్టు గుర్తించారు. వెంటనే ఇంజక్షన్లు ఇవ్వడంతో ఐదు నిమిషాల్లోనే కోటంరెడ్డి పరిస్థితి మెరుగుపడి స్టేబుల్ అయిందన్నారు వైద్యులు. కోటంరెడ్డికి యాంజియోగ్రామ్, లేజర్ అబ్లేషన్ అనే ట్రీట్‌మెంట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీని కోసం కోటంరెడ్డిని వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ప్రత్యేక అంబులెన్స్‌లో చెన్నై అపోలో హాస్పిటల్‌కు తరలించారు.
చెన్నై అపోలో హాస్పిటల్‌లో రేపు కోటంరెడ్డికి యాంజియోగ్రామ్, లేజర్ అబ్లేషన్ చేయనున్నారు. ఈ ప్రొసీజర్ పూర్తయిన తర్వాత సోమవారం లేదా మంగళవారం తిరిగి ఆయన నియోజకవర్గానికి వస్తారని చెప్పారు నెల్లూరు అపోలో వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.