AP POLITICAL PICTURE: ఏపీలో కాక రేపుతున్న రాజకీయ పార్టీలు.. రెండేళ్ళ ముందే వ్యూహాలకు పదును.. ఇక పోటాపోటీ యాత్రలు, సభలు

రైట్‌ రైట్‌ అంటూ వైసీపీ బస్సు బయల్దేరింది. నాలుగు రోజులు. శ్రీకాకుళం టు అనంతపురం. సై సై అంటూ సైకిల్‌ జోష్‌గా సాగుతోంది. ఒంగోలు వేదికగా రెండ్రోజుల పసుపు పండుగకి రెడీ అయింది. టైమ్.. టైమింగ్‌ అదిరిపోయాయి.

AP POLITICAL PICTURE: ఏపీలో కాక రేపుతున్న రాజకీయ పార్టీలు.. రెండేళ్ళ ముందే వ్యూహాలకు పదును.. ఇక పోటాపోటీ యాత్రలు, సభలు
Chandrababu Vs Jagan
Follow us

|

Updated on: May 27, 2022 | 4:51 PM

AP POLITICAL PICTURE SUDDENLY TAKEN MOMENTUM YCP BUS YATRA AND TDP MAHANADU: ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రెండు పార్టీలు. రెండు వేదికలు..కానీ లక్ష్యం మాత్రం ఒకటే. రైట్‌ రైట్‌ అంటూ వైసీపీ(YSRCP) బస్సు బయల్దేరింది. నాలుగు రోజులు. శ్రీకాకుళం(Srikakulam) టు అనంతపురం(Anantapur). సై సై అంటూ సైకిల్‌ జోష్‌గా సాగుతోంది. ఒంగోలు(Ongole) వేదికగా రెండ్రోజుల పసుపు పండుగకి రెడీ అయింది. టైమ్.. టైమింగ్‌ అదిరిపోయాయి. అంతే ఒక్కసారిగా పొలిటికల్ హీట్‌ పీక్‌ స్టేజ్‌కు చేరింది. ఏపీలో రెండు ప్రధాన పార్టీలు… ఒకటి అధికార వైసీపీ. రెండు ప్రతిపక్ష తెలుగుదేశం(TDP). రెండు పార్టీలు బలంగా జనంలోకి వెళ్లాలని చూస్తున్నాయి. ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 2024 దాకా గడువుంది. అంటే ఇంకా రెండేళ్ళ టైమ్ ఉంది. కానీ ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలన్నది రెండు పార్టీల స్కెచ్. అందుకు తగ్గట్లుగానే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే గడపగడపకు వైసీపీ పేరుతో ముమ్మరంగా పర్యటిస్తూ.. ప్రతి ఇంటిని పలకరిస్తున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు. ఈ మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి.. సంక్షేమపథకాల్ని వివరిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేసింది.? ఏం చేయబోతోంది అన్నది స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పుడు బస్సుయాత్ర పేరుతో గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టుంది వైసీపీ. జగన్(CM Jagan) పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించడం ఈ బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం. శ్రీకాకుళం జిల్లాలో మొదలైన ఈ యాత్ర.. అనంతపురం వరకు అంటే ఉమ్మడి 13 జిల్లాలను కవర్ చేసేలా సాగుతుంది. ‌రాష్ట్ర కేబినెట్‌లోని 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు ఈ బస్ యాత్రలో పాల్గొంటున్నారు. పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత.. సామాజిక న్యాయం, స్థానిక సంస్థల నుంచి రాజ్యసభ వరకు రాజకీయ పదవులు.. ఆయా వర్గాలకు జరిగిన, చేసిన న్యాయాన్ని ప్రజలకు వివరిస్తారు. బస్సు యాత్ర వెనుక వైసీపీ వ్యూహం క్లియర్‌గా కనిపిస్తోంది. ఇప్పటి నుంచే ఎలక్షన్ ప్లానింగ్ షురూ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు టైమ్ ఉంది కదా అని లైట్‌ తీసుకోవడం లేదు అధికార పార్టీ. ఆ ఛాన్స్ తీసుకోవడం లేదు. ఆ దిశగా పార్టీ శ్రేణులు, మంత్రులకు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు సీఎం జగన్. అందుకే 2022లోనే 2024 టార్గెట్‌గా పని మొదలుపెట్టేశారు. ఇక టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీకి వచ్చే రెండేళ్లు చాలా కీలకం. ఈ మధ్యే 40 ఏళ్ల నవయవ్వనంలో అడుగుపెట్టిన తెలుగుదేశం పార్టీ TELUGU DESHAM PARTY.. అదే జోష్‌ను కంటిన్యూ చేయాలని చూస్తోంది. మహానాడు(TDP Mahanadu)ని చాలా గ్రాండ్‌గా నిర్వహించడం … పలుకీలక తీర్మానాలు చేయడం ద్వారా… జనానికి స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. మంగళగిరి నుంచి ఒంగోలు మహానాడు వేదికకు భారీ ర్యాలీ చేపట్టింది టీడీపీ. పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపేందుకు. 2024 టార్గెట్‌గా పలు కీలక తీర్మానాలు చేసేందుకు… మహానాడుని వేదిక చేసుకోనుంది తెలుగుదేశం. మహానాడు MAHANADUతో పాటే ఎన్టీయార్ శతజయంతి వేడుకలు టీడీపీకి పొలిటికల్‌గా చాలా ఇంపార్టెంట్. మే 28వ తేదీన ఎన్టీఆర్ NTR శతజయంతి. ఆ రోజు నుంచి 2023 మే 28 వరకు 365 రోజులపాటు శత పురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచెరగులా జరుపుతామని నందమూరి బాలకృష్ణ NANDAMURI BALAKRISHNA ఇప్పటికే ప్రకటించారు. మునుపెన్నడూ జరగని రీతిలో దేశ, విదేశాల్లో అత్యంత ఘనంగా ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. అధికార పార్టీ చేపట్టిన గడపగడపకు వైసీపీ కావచ్చు. సామాజిక న్యాయభేరి మోగిస్తూ సాగుతున్న బస్సుయాత్ర కావచ్చు…రెండూ పొలిటికల్ ప్లానింగ్‌లో భాగంగా జరుగుతున్నవే. ఇటు టీడీపీ మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు రాజకీయంగా అత్యంత ప్రధాన్యం ఉన్న ఈవెంట్సే. మొత్తానికి ఇప్పుడు ఏపీ రాజకీయం మంచి కాక మీదుంది. ఎలక్షన్‌ మూడ్ చాలా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జనరల్‌గా ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలు, బస్సు యాత్రల పేరుతో జనంలోకి వెళ్తుంటాయి. కానీ ఇక్కడ అధికార వైసీపీ సామాజిక న్యాయభేరి పేరుతో, సరికొత్త వ్యూహంతో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అది కూడా తెలుగుదేశం మహానాడుకు ఒకరోజు ముందు స్టార్ట్ చేసింది..! మహానాడు ముగిసిన తర్వాత యాత్ర ఎండ్‌ అయ్యేలా ప్లాన్ చేసింది. అంటే మహానాడు కొనసాగిన రెండ్రోజుల్లో వైసీసీ బస్ యాత్ర కూడా ప్రచార మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం కానున్నది. అలా జరగాలన్నదే వైసీసీ అధినేత అభిమతమని తెలుస్తోంది. ఈ సామాజిక న్యాయభేరి ద్వారా YCP ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి? చెప్పదల్చుకున్న విషయం ఏంటి? ఈ అంశాలు ఆసక్తిరేపుతున్నాయి.

AP పాలిటిక్స్‌లో కులాలకున్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పేపనే లేదు. అందుకే రాజకీయమంతా సామాజిక న్యాయం చుట్టూనే తిరుగుతుంటుంది. ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం నుంచి మొదలు పెడితే.. గెలిచిన తర్వాత దక్కే కేబినెట్ బెర్తులు, నామినేటెడ్ పోస్టులు అన్నింటిలోనూ ఈ లెక్కలు, ఈక్వేషన్స్‌ పక్కాగా ఉంటాయి. స్పష్టంగా కనిపిస్తాయి. తెలుగుదేశం కావచ్చు.. వైసీపీ కావచ్చు..ఆ మాటకొస్తే పొలిటికల్ పార్టీలన్నీ ఫాలోఅయ్యే ఫార్ములానే ఇది. సోషల్ ఇంజినీరింగ్ మాదిరిగానే ఇప్పుడు ఏపీలో పొలిటికల్ ఇంజినీరింగ్ జరుగుతోంది. ఏపీలో ఓబీసీ OBC లు అతిపెద్ద ఓటు బ్యాంకు. గెలుపోటములను డిసైడ్ చేసే ఫ్యాక్టర్. వారి దీవెనలు ఎవరికి లభిస్తే వాళ్లే అధికారపీఠంపై కూర్చొంటారు. 2014, 2019 ఎన్నికల్లో ఈ విషయం రుజువైంది కూడా ! అందుకే ఇప్పుడు ఆ బడుగు, బలహీన వర్గాలను ఆకట్టుకునేందుకు పార్టీలు తాపత్రయ పడుతున్నాయి..! ఇప్పుడు వైసీపీ శ్రీకారం చుట్టున సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కూడా ఈ ఆలోచనలో భాగమే. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అన్న నినాదంలోంచి పుట్టుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. సహజంగానే అప్పటి నుంచి బీసీలు ఆ పార్టీకి అండగా నిలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఇందులో మ్యాగ్జిమమ్ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. అఫ్‌కోర్స్‌ 2019లో ఓబీసీలు జగన్ వెంట నిలవడం వల్లే ఆ రేంజ్‌లో వన్‌సైడ్‌ విక్టరీ సాధ్యమైంది. వైసీపీ 151 సీట్లను గెలుచుకోగలిగింది. అయితే ఈ ఓటుబ్యాంకు నిలుపుకోవడం.. మళ్లీ ఆయా వర్గాల ఓట్లు పొందడం ఇప్పుడు వైసీపీ ముందున్న అతి పెద్ద ఛాలెంజ్. మొన్న జరిగిన కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణలోనూ జగన్‌ ఫాలో అయిన సూత్రం సామాజిక న్యాయమే. తొలి కేబినెట్‌లో మొత్తం 25 మందిలో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల, మైనార్టీలకు పదవులు ఇచ్చారు. అంటే 56 శాతం. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు ఓబీసీలకే కేటాయించారు. ఇక ప్రస్తుత కేబినెట్‌లో ఈ సంఖ్య మరింత పెంచారు. 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. అంటే 70 శాతం. ఇందులోనూ బీసీలకు మరింత పెద్దపీట వేశారు. 25 మంత్రుల్లో 10 మంది వాళ్లే. బీసీ లంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్‌బోన్‌ క్లాస్ అంటూ కొత్త నిర్వచనం కూడా చెప్పారు వైసీపీ అధినేత. ఆచరణలోనూ అదే చేసి చూపించారన్నది వైసీపీ నేతల మాట. 13 జడ్పీల్లో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకిచ్చారు. 13 కార్పొరేషన్లలో ఏడు అంటే 50 శాతానికిపైగా ఇచ్చారు. మేయర్‌ పదవుల్లో 92 శాతం. మునిసిపాలిటీల్లో 73 శాతం. ఇలా అన్ని పదవుల్లోనూ తమ ప్రభుత్వ ప్రాధాన్యం బడుగుబలహీన వర్గాలే అని లెక్కలతో సహా వివరిస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఇదే అంశాన్ని జనాల్లోకి చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది . పార్టీకి ఇప్పటికే ఉన్న సంప్రదాయ ఓటుబ్యాంకుకి ఓబీసీ ఓటు బ్యాంకు కూడా తోడైతే వచ్చే ఎన్నికల్లోను తమకు తిరుగు ఉండదన్నది వైసీపీ నేతల అంచనా.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన 17 మందితో బస్సు యాత్ర చేయడం ద్వారా ఆయా వర్గాల్ని ఆకట్టుకునే పని చేస్తోంది వైసీపీ. అయితే ఇక్కడే కొన్నివిమర్శలు కూడా వినిపిస్తున్నాయి.. గడప గడపకు వెళ్తే నిరసనలు వ్యక్తమవుతాయి.. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ వుండబట్టే మధ్యేమార్గంగా బస్సు యాత్రకు ప్లాన్‌ చేశారని ఆరోపిస్తున్నాయి విపక్షాలు.

ఇక ఈ మధ్య వైసీపీ రెండు రాజ్యసభ RAJYASABHA సీట్లను తెలంగాణ TELANGANA వ్యక్తులకు ఇవ్వడంపైనా విమర్శలు వచ్చాయి. దీన్ని కూడా తమ పొలిటికల్ అస్త్రాల్లో ఒకటిగా ప్రయోగిస్తోంది తెలుగుదేశం. బీసీ జపం చేసే వైసీపీ నేతలు తెలంగాణకు చెందిన ఆర్‌. కృష్ణయ్యను రాజ్యసభకు ఎందుకు పంపారని నిలదీస్తోంది. అంటే రాష్ట్రంలో బీసీ నాయకులే లేరా లేక వైసీపీకి కనిపించలేదా అన్న ప్రశ్న లెవనెత్తుతున్నారు. మొత్తం బీసీ కులాలకు ఆయన్నో ప్రతినిధిగా చూశామే తప్ప.. రాష్ట్రాలతో దీనికి సంబంధం లేదన్నది వైసీపీ వర్షన్. ఒక్కటి మాత్రం క్లియర్.. ఏపీలో డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్న ఓబీసీలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం వైపు చూస్తున్న ఓటర్లను తనవైపుకు తిప్పుకోవడం.. పార్టీని కొత్త వర్గాలకు చేరువ చేయడం అనే వ్యూహాన్ని చాలా పక్కాగా అమలు చేస్తోంది. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఈ సోషల్ అండ్ పొలిటికల్ ఇంజినీరింగ్ తోడైతే…2024లో మళ్లీ అధికారాన్ని నిలుపుకోవడం ఈజీ అవుతుందన్నది జగన్ వ్యూహమని తెలుస్తోంది. కరోనా కారణంగా గత రెండు దఫాలుగా మహానాడు నిర్వహించలేదు తెలుగుదేశం. కేవలం ఆన్‌లైన్ సమావేశాలకే పరిమితం అయ్యారు. అందుకే ఇప్పుడు ఒంగోలులో జరిగే మహానాడుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2019 ఎన్నికల్లో పార్టీకి ఊహించని పరాభవం ఎదురైంది. 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ స్థితి నుంచి మళ్లీ అధికార పీఠం దిశగా అడుగులు పడాలి. అది కూడా అత్యంత బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టి ఎదురు నిలవాలి. మరి పార్టీ ఇప్పుడు ఆ స్థితిలో ఉందా అన్న అనుమానం ఎక్కడో.. ఏ మూలనో పార్టీ శ్రేణుల్లో అలా ఉండిపోయింది. అదిగో ఆ డౌట్లను క్లియర్ చేసే ప్రయత్నమే ఇప్పుడు జరుగుతోంది. బడుగు బలహీన వర్గాలే టార్గెట్‌గా దూసుకెళ్తోంది వైసీపీ. సంక్షేమ పథకాలు కావచ్చు.. పొలిటికల్ పదవులు కావచ్చు.. ఆ వర్గాలకే పెద్దపీట వేసింది. అంటే టీడీపీకి బలంగా ఉన్న ఓటు బ్యాంకుపై పక్కా ప్లాన్‌తో గురిపెట్టింది వైసీపీ. మరీ వైసీపీ వ్యూహాన్ని ఎదుర్కొనడానికి తెలుగుదేశం ఎలాంటి హామీలు గుప్పిస్తుంది.. మహానాడులో ఆ దిశగా సంచలన తీర్మానాలు ఏమైనా ఉంటాయా అన్నది ఆసక్తికరం.  ఇక గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఏపీలో ముందస్తు ఎలక్షన్ల మాట వినిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ ఈ అంశాన్నిపదేపదే ప్రస్తావిస్తోంది.. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సిద్ధం అంటోంది. అధికార పార్టీ చేపట్టిన బస్సుయాత్రలు, గడపగడపకు వైసీపీ వంటి కార్యక్రమాల ద్వారా సహజంగానే టీడీపీలో ఈ ముందస్తు అనుమానాలు మొదలవ్వొచ్చు. అయితే మహానాడుకి భయపడే సరిగ్గా ఆటైమ్‌లోనే వైసీపీ బస్సుయాత్ర చేపట్టిందంటూ ఆరోపణలూ చేస్తోంది. కోనసీమలో రేగిన అలర్లపైనా ఇప్పటికే తెలుగుదేశం, వైసీపీ మధ్య ఓరేంజ్‌లో మాటల యుద్ధం నడుస్తోంది. ఇక 2024కు రెండు పార్టీలు ఇప్పుడే స్లోగన్లను సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. మహానాడు ద్వారా క్విట్ జగన్.. సేవ్ ఏపీ నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం. ఇప్పటికే దాన్ని అమల్లో పెట్టినట్లు కూడా కనిపిస్తోంది. టీడీపీ ఎత్తుకున్న క్విట్‌ నినాదానికి వైసీపీ కూడా అదే రేంజ్‌లో బదులిస్తోంది. 2019లోనే జనం బాబుని వద్దనుకున్నారు. 2023లోనూ అదే రిపీట్ అయ్యే అవకాశం వుంది. అరిగిపోయిన పాత డైలాగ్‌లు చెప్పడం కాదు…జగన్ ముద్దు.. చంద్రబాబు వద్దు అనే నినాదమే 2024లో ప్రజులు ఇవ్వబోయే తీర్పు అంటూ జోస్యం చెప్పేస్తున్నారు వైసీపీ మంత్రులు. ఇక పొత్తులపైనా ఇప్పటికే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ విషయంలో వైసీపీ స్టాండ్ క్లియర్. సింహం సింగిల్‌గానే వస్తుందన్న స్లోగన్‌ను ఆ పార్టీ ఎప్పుటి నుంచో బలంగా జనంలోకి తీసుకెళ్తోంది. ఎటొచ్చి తేల్చుకోవాల్సింది విపక్షాలే. ఇదే ఇష్యూపై అధికార పార్టీ నుంచి ఇప్పటికే సవాళ్ల పర్వం ఓ రేంజ్‌లో నడుస్తోంది. టీడీపీ-బీజీపీ-జనసేన TDP-BJP-JANASENA ఈ మూడు పార్టీల్లో ఎవరు ఎవరితోచేయి కలుపుతారు. 2024 నాటికి ఎలాంటి ఈక్వేషన్స్ తెరపైకి వస్తాయన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయమంటూ జనసేన… ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమంటూ టీడీపీ..మధ్యమధ్యలో లీకులు ఈస్తూ ఈ పొత్తు కథా చిత్రాన్ని రక్తి కట్టిస్తున్నాయి. ఇక కలిసి నడుస్తామంటున్న బీజేపీ-జనసేన మధ్య కూడా ఈ మధ్య గ్యాప్ పెరిగినట్లు కనిపిస్తోంది.. అవసరం అయితే జనసేనతో పొత్తు అంటూ ఆ మధ్య ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు చేసిన కామెంట్‌లో చాలా అర్థాలే కనిపిస్తాయి. మొత్తానికి అందరి లక్ష్యం ఒకటే. అదే 2024 ఎన్నికలు. రెండేళ్ల ముందుగానే సాగుతున్న ఈ పొలిటికల్ వ్యూహాల్లో ఎవరుపైచేయి సాధిస్తారు? ఎలాంటి ఎత్తుగడలతో ముందుకొస్తారు అన్నది ఆసక్తికరం.

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!