Nara Lokesh: ‘పుంగునూరు వీరప్పన్ పెద్దిరెడ్డి’.. ఏపీ మంత్రిపై నారా లోకేష్ తీవ్ర విమర్శలు.!

Nara Lokesh Comments: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి అని విమర్శించారు.

Nara Lokesh: 'పుంగునూరు వీరప్పన్ పెద్దిరెడ్డి'.. ఏపీ మంత్రిపై నారా లోకేష్ తీవ్ర విమర్శలు.!
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 17, 2021 | 3:22 PM

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి అని విమర్శించారు. ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నట్లే.. ప్రజాస్వామ్యాన్ని కూడా ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి నియోజ‌క‌వ‌ర్గానికి బ‌య‌టి నుంచి త‌న ముఠాల‌ను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు.

పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కళ్యాణమండపంలో ఐదు వేల మంది మకాం వేసి దొంగ ఓట్లు వేయడానికి వెళ్తున్నారని పేర్కొన్నారు. ఉప‌ఎన్నిక‌లో రిగ్గింగ్‌, దొంగ ఓట్లతో వైసీపీ నెగ్గాల‌ని వేసిన ప్రణాళిక‌ను తెలుగుదేశం బట్టబయలు చేసిందని.. ఇప్పటికైనా దీనిపై కేంద్ర ఎన్నిక‌‌ల క‌మిష‌న్ స్పందించి పెద్దిరెడ్డి, వైసీపీ మంత్రుల్ని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read:

ఆ వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు ఎక్కువ.. తస్మాత్ జాగ్రత్త.! హెచ్చరిస్తున్న వైద్యులు..

మద్యం సేవిస్తే కరోనా వైరస్ తగ్గుతుందా.? అపోహలు.. నిజాలు.! వివరాలివే..

కూరగాయలు సర్దుతుండగా భార్యాభర్తలకు ఊహించని షాక్.. పాలకూర‌లో నక్కిన పాము.. భయానక వీడియో.!