Shock To TDP: టీడీపీకి భారీ షాక్.. 13 జిల్లాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మూకుమ్మడిగా రాజీనామా

  తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీకి క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు రాజీనామా చేశారు. 13 జిల్లాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మూకుమ్మడిగా గుడ్ బై చెప్పారు.

Shock To TDP: టీడీపీకి భారీ షాక్.. 13 జిల్లాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మూకుమ్మడిగా రాజీనామా
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 12, 2021 | 3:57 PM

Shock To TDP:  తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీకి క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు రాజీనామా చేశారు. 13 జిల్లాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మూకుమ్మడిగా గుడ్ బై చెప్పారు. క్రైస్తవ మతం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రైస్తవ సమాజాన్ని బాధించేలా చంద్రబాబు మాట్లాడారని టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ పేర్కొన్నారు. మత మార్పిడి విషయంలో కూడా క్రిష్టియన్‌లను అవమానించారని ఆరోపించారు. బలవంతంగా మత మార్పిడిలు ఎక్కడ జరుగుతున్నాయో నిరూపించాలన్నారు. క్రైస్తవులపై ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారో చంద్రబాబు చెప్పాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు.

కాగా చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా ఇటీవల మాజీ ఎమ్మెల్యే ఫిలిప్‌ సి తోచర్‌ సైతం టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు వైఖరి అసహ్యం పుట్టిస్తుందని రాజీనామా అనంతరం ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు మెడలో శిలువ వేసుకుని తిరిగిన చంద్రబాబు.. ఇప్పుడు క్రైస్తవులను అవమానిస్తున్నారని పేర్కొన్నారు.

Also Read:

AP SEC vs AP Government: ఎన్నికల కమిషన్ సెక్రటరీ పోస్ట్ నుంచి వాణీమోహన్‌ను తొలగిస్తూ ఎస్‌ఈసీ ఉత్తర్వులు

Family Suicide: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం.. ఏడాదిన్నర బాలుడు సహా దంపతులు బలవన్మరణం