Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti special bus services : పల్లెకు పోదాం చలో చలో.. సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులు

సంక్రాంతికి సొంత ఊళ్లకి వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించింది తెలంగాణ ‌ఆర్టీసీ. పండుగ రద్దీ కారణంగా..

Sankranti special bus services : పల్లెకు పోదాం చలో చలో.. సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులు
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 12, 2021 | 6:41 PM

Sankranti special bus services : సంక్రాంతికి సొంత ఊళ్లకి వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించింది తెలంగాణ ‌ఆర్టీసీ. పండుగ రద్దీ కారణంగా నిత్యం నడిపే బస్సుల్లో సీట్లన్నీ బుక్‌ అవుతున్నాయి. దీంతో పలు మార్గాల్లో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌‌లోని వివిధ జిల్లాలకు వెళ్లే బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది.

ప్రత్యేకించి హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వచ్చే సర్వీసులకు అధిక డిమాండ్‌ ఉంది. సోమ, మంగళవారాల్లో రెగ్యులర్‌ సర్వీసులు దాదాపు నిండిపోయాయి. దీంతో అధికారులు అదనంగా ప్రత్యేక బస్సులకు ముందస్తు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పించారు.

మొత్తంగా 3,607 సంక్రాంతి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తోంది. అందులో హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాలకు 1,600 ప్రత్యేక సర్వీసులు ఉన్నాయి. ఆయా మార్గాల్లో రద్దీని బట్టి మరిన్ని ప్రత్యేక సర్వీసులు పెంచేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సీబీఎస్‌ నుంచి కర్నూల్‌, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, మాచర్ల, నెల్లూరు‌ వైపు వెళ్లే షెడ్యూలు‌ బస్సులతోపాటు స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేశారు.

తెలంగాణలో వివిధ జిల్లాల మధ్య తిరిగే బస్సుల్లో కూడా సంక్రాంతికి రద్దీ కనిపిస్తోంది. జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాలకు షెడ్యుల్‌ బస్సులతో పాటు స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేశారు. ఇక ఉప్పల్‌ ఎక్స్‌ రోడ్‌ నుంచి యాదగిరిగుట్ట, వరంగల్‌ వైపు వెళ్లే వారికోసం.. షెడ్యూల్‌ బస్సులతోపాటు స్పెషల్‌ బస్సులు నడుపుతున్నారు.

ప్రైవేటు ట్రావెల్స్‌ ఛార్జీల బాదుడు

పండుగ వేళ ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు రెట్టింపు చేశాయి. ప్రైవేటు ట్రావెల్స్‌ నిత్యం తిరిగే సర్వీసుల్లోనే ఛార్జీలను ఒక్కసారిగా పెంచేశారు. హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి వచ్చే ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ సర్వీసులో ఛార్జీ రూ.600 ఉండగా, ప్రత్యేక సర్వీసుల్లో రూ.900 వరకు ఉంది. అదే ప్రైవేటు ట్రావెల్స్‌లో రూ.1,400-1,600 వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఏలూరుకు ఆర్టీసీ సూపర్‌లగ్జరీ ఛార్జీ రూ.485 కాగా, ప్రత్యేక బస్సుల్లో రూ.720 తీసుకుంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌లో మాత్రం రూ.1300-1500 రాబడుతున్నారు.

నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ