Chandrababu: ఏపీని నంబర్‌ వన్‌గా మార్చాలన్నదే మా లక్ష్యం.. విజన్‌ 2029 గురించి చెప్పిన చంద్రబాబు..

తెలుగు ప్రజల కోసం నిరంతరం టీడీపీ శ్రమించిందన్నారు. రెండు రాష్ట్రాలూ అభివృద్ధి కావాలన్నారు. విభజన వేళ ఏపీకి రూ.1.10 లక్షల కోట్ల అప్పు వచ్చింది. రూ.16వేల కోట్లు లోటు బడ్జెట్‌ ఉంది. సవాళ్లను అధిగమించి 2029 విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu: ఏపీని నంబర్‌ వన్‌గా మార్చాలన్నదే మా లక్ష్యం.. విజన్‌ 2029 గురించి చెప్పిన చంద్రబాబు..
Chandrababu
Follow us

|

Updated on: Jun 02, 2023 | 5:03 PM

రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయన సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలని అభిలాషించారు. తెలుగు ప్రజల కోసం నిరంతరం టీడీపీ శ్రమించిందన్నారు. రెండు రాష్ట్రాలూ అభివృద్ధి కావాలన్నారు. విభజన వేళ ఏపీకి రూ.1.10 లక్షల కోట్ల అప్పు వచ్చింది. రూ.16వేల కోట్లు లోటు బడ్జెట్‌ ఉంది. సవాళ్లను అధిగమించి 2029 విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాం. 2029 నాటికి ఏపీ నంబర్‌ వన్‌గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పోలవరం ద్వారా నదుల అనుసంధానంతో ఏపీని సస్యశ్యామలం చేయాలనుకున్నాం. నదులు అనుసంధానిస్తే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే వీలు కలుగుతుందని భావించామని గుర్తు చేశారు చంద్రబాబు.

అందులో భాగంగానే రూ.64 వేల కోట్ల ఖర్చుతో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామన్నారు. పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తి చేశామని.. 2025కి ఫేజ్‌-1 పూర్తి చేస్తామని సిగ్గు లేకుండా వైసీపీ ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. ప్రాజెక్టు పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రజల జీవనాడి పోలవరాన్ని సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రగతిని, మన భవిష్యత్తును అడ్డుకునే పరిస్థితికొచ్చారు. అదే టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 జూన్‌ నాటికి పోలవరం పూర్తయ్యేదన్నారు చంద్రబాబు.

తొమ్మిదేళ్ల తర్వాత కూడా ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశాం. టీడీపీ హయాంలో ఏపీలో ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామన్నారు. విభజన చట్టంలో ఇస్తామన్న కేంద్ర విద్యా సంస్థలు ఎందుకు రావడం లేదని.. 22 సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా ఏం చేశారని.. విభజన జరిగిన రోజున.. రాష్ట్ర పరిస్థితేంటనే దానిపై కనీసం ఆలోచన చేయలేరా అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం