AP News: ఎన్డీయేతో పొత్తుపై చంద్రబాబు ట్వీట్.. బుజ్జగింపులకు తెరలేపిన అధినేత..

ఎన్డీయేతో కలిసి పనిచేయడం చాల ఆనందంగా ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్ర, దేశ ప్రయోజనాలు, అభివృద్ది కోసమే కలిసి పనిచేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. బిజెపి, టిడిపి, జనసేనల మధ్య కేవలం పొత్తు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‎తో పాటు దేశానికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్న ముగ్గురు వ్యక్తుల భాగస్వామ్యం అని ట్వీట్ చేశారు.

AP News: ఎన్డీయేతో పొత్తుపై చంద్రబాబు ట్వీట్.. బుజ్జగింపులకు తెరలేపిన అధినేత..
Chandrababu Amit Shah Jp Nadda

Updated on: Mar 09, 2024 | 9:53 PM

ఎన్డీయేతో కలిసి పనిచేయడం చాల ఆనందంగా ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్ర, దేశ ప్రయోజనాలు, అభివృద్ది కోసమే కలిసి పనిచేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. బిజెపి, టిడిపి, జనసేనల మధ్య కేవలం పొత్తు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‎తో పాటు దేశానికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్న ముగ్గురు వ్యక్తుల భాగస్వామ్యం అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించిన నియోజకవర్గాల్లోని టీడీపీ ఇన్‌ఛార్జ్‌లతో చంద్రబాబు మాట్లాడారు. టికెట్‌ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేయాలని సూచించారు. సీటు దక్కని ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ టీడీపీ నేతలు, వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వరుసగా మాట్లాడుతున్నారు. టీడీపీ-జనసేన పొత్తుల్లో భాగంగా ఇప్పటికే 99 సీట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులపై నేతలతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్వతీపురం, కురుపాం, ఎర్రగొండపాలెం, నంద్యాల, కళ్యాణదుర్గంలోని ఆశావహులతో కూడా చంద్రబాబు మాట్లాడారు. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలను, తీసుకునే నిర్ణయాలను నాయకులు అర్థం చేసుకుని కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు.

19 నియోజకవర్గాల్లోని నేతలతో స్వయంగా మాట్లాడి ఎన్నికలు సిద్దం కావాలని సూచించారాయన. పొత్తులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి సీటు వచ్చినా గెలిపించేందుకు పనిచేయాలని నేతలకు సూచించారు చంద్రబాబు. సీటు దక్కని ప్రతి ఒక్కరికి పార్టీ న్యాయం చేస్తుందని నేతలకు హామీ ఇస్తున్నారాయన. స్వయంగా చంద్రబాబు మాట్లాడడంతో పార్టీ విజయం కోసం పనిచేస్తామని నేతలు చెబుతున్నారు. రెండు రోజులుగా హస్తినలో మకాం వేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌, చంద్రబాబు బీజేపీ హై కమాండ్‌తో చర్చలు జరిపారు. పొత్తులు, సీట్ల పంపకాలపై స్పష్టత వచ్చింది. అయితే అభ్యర్థుల ఎంపిక స్థానాలపై కసరత్తు జరుగుతోంది. బీజేపీ కోరుకుంటోన్న అసెంబ్లీ, ఎంపీ స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ తరుణంలో ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో మాట్లాడటం ద్వారా ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు పవన్‌, చంద్రబాబు. కొందరిలో అసమ్మతి ఉంటే.. మరికొందరిలో అధికారంలోకి వస్తామన్న ఆశ నెలకొంది. దీంతో సర్దుకుపోయేందుకు కొందరు సిద్దమవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..