Chandrababu: చివరి అవకాశం నాకు కాదు.. ప్రజలకే.. టీడీపీ చీఫ్ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

|

Nov 30, 2022 | 5:10 PM

భయపడితే ఆ భయమే మనల్ని చంపేస్తుందంటూ చంద్రబాబు తెలిపారు. . ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో.. ఇదేం ఖర్మ పేరుతో చంద్రబాబు కార్యక్రమాన్ని చేపట్టారు.

Chandrababu: చివరి అవకాశం నాకు కాదు.. ప్రజలకే.. టీడీపీ చీఫ్ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
Chandrababu Naidu
Follow us on

‘‘చివరి అవకాశం నాకు కాదు.. ప్రజలకు.. ఇప్పుడైనా ప్రజలంతా కళ్లు తెరవాలి.. మరోసారి ఉన్మాదులు గెలిస్తే అమరావతి, పోలవరం ఉండదు.. నాకేం కొత్త చరిత్ర అవసరం లేదు.. ప్రజల మంచి కోసమే చెబుతున్నా’’.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీలో సీఎంగా చేశానని.. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. తనకు ఎమ్మెల్యే పదవితో పనిలేదని.. రాష్ట్ర ప్రజల్లో చైతన్యం రావాలని, అందుకు అంతా ధైర్యంగా ముందుకు రావాలని పేర్కొన్నారు. భయపడితే ఆ భయమే మనల్ని చంపేస్తుందంటూ చంద్రబాబు తెలిపారు. . ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో.. ఇదేం ఖర్మ పేరుతో చంద్రబాబు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం దిగిపోతేనే ఏపీ రాష్ట్రం బాగుపడుతుందని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్‌ అంటూ జగన్‌.. ప్రజల నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టారని విమర్శించారు. రాష్ట్రం అన్ని రకాలుగా దెబ్బతిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్కడ చూసినా జనం ఇదేం ఖర్మ అనే పరిస్థితికి వచ్చిందన్నారు.

ఆనాడు తాను చెప్పిందే.. ఇవాళ జరుగుతోందని.. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ప్రజలు ఇప్పుడైనా తన మాట వింటారని ఆశిస్తున్నారని.. ఇప్పుడు కూడా వినకపోతే ఈ రాష్ట్రానికి ఇదే ఆఖరి అవకాశం అవుతుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వంలోనే పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని.. జగన్ ప్రభుత్వం రివర్స్‌ టెండర్ పేరిట పోలవరాన్ని గోదావరిలో ముంచేసిందన్నారు.

వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణను ఆయన కుమార్తె వైఎస్‌ సునీత తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయించడం సీఎం జగన్‌కు చెంపదెబ్బ లాంటిదని చంద్రబాబు విమర్శించారు. ఈ అంశంపై జగన్ ఎందుకు స్పందించడం లేదన్నారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని లండన్‌ బాబు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..