King Cobra: హడలెత్తించిన కింగ్ కోబ్రా.. దాని పొడవు చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..! వైరల్ వీడియో.
అనకాపల్లి జిల్లాలో కింగ్ కోబ్రా హడలెత్తించింది. బుసలు కొడుతూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. అడవుల్లో మాత్రమే ఉండే కింగ్ కోబ్రా ఇక్కడికెలా వచ్చిందని హడలిపోయారు జనం. అత్యంత భయంకరమైన,
అనకాపల్లి జిల్లాలో కింగ్ కోబ్రా హడలెత్తించింది. బుసలు కొడుతూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. అడవుల్లో మాత్రమే ఉండే కింగ్ కోబ్రా ఇక్కడికెలా వచ్చిందని హడలిపోయారు జనం. అత్యంత భయంకరమైన, విషపూరితమైన ఈ నల్లత్రాచును చూస్తేనే గుండెలదురుతాయి. అలాంటిది, కళ్ల ముందుకొచ్చి బుసలు కొడితే పరిస్థితి ఏంటి?. అనకాపల్లి జిల్లాలో అదే జరిగింది. పొలంలో పనిచేసుకుంటున్న ఓ రైతుకు అలాంటి పరిస్థితే ఎదురైంది. వి.మాడుగుల మండలం పాలగడ్డలో పది అడుగులు కింగ్ కోబ్రా హడలెత్తించింది. పొలంలో బుసలు కొడుతూ కనిపించడంతో భయంతో వణికిపోయాడు రైతు జగ్గారావు. అక్కడ్నుంచి గ్రామంలోకి పరుగులు పెట్టాడు.రైతు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ వెంకటేష్.. అతికష్టంమీద కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. పొలంలో అటుఇటు తిరుగుతూ అందర్నీ పరుగులు పెట్టించింది గిరినాగు. దాంతో, కింగ్ కోబ్రాను బంధించేందుకు ఫారెస్ట్ సిబ్బంది సహకారం తీసుకోవాల్సి వచ్చింది. అత్యంత చాకచక్యంగా నల్లత్రాచును పట్టుకున్న స్నేక్ క్యాచర్ వెంకటేష్.. దాన్ని అడవిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టాడు. దట్టమైన అడవుల్లో మాత్రమే తిరిగే కింగ్ కోబ్రా జనావాసాల్లోకి రావడాన్ని కథలుకథలుగా చెప్పుకుంటున్నారు స్థానికులు. ఇదొక్కటేనా? ఇంకా ఉన్నాయా? అంటూ భయాందోళనలకు గురవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

