Chandrababu: రజనీకాంత్ ఏదో అంటే మీద పడిపోయారు.. కాపులతో పవన్‌ను తిట్టిస్తున్నారు.. ‘వైసీపీ’పై చందబ్రాబు మండిపాటు
రాష్ట్రంలో రివర్స్ పాలనతో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయని, ఇందుకు వైసీపీ సర్కారు అవలంభిస్తోన్న విధానాలే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో రివర్స్ పాలనతో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయని, ఇందుకు వైసీపీ సర్కారు అవలంభిస్తోన్న విధానాలే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘మా ప్రభుత్వం లో 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. 5.13 లక్షల మందికి ఉద్యోగలిచ్చామని వాళ్ళ మంత్రే చెప్పారు. 2019 అక్టోబర్ నుంచి 2022 డిసెంబర్ వరకూ ఏపీ కి 5,751 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం పెట్టుబడుల్లో ఏపీ అధోగతికి వెళ్లిపోయింది. పెట్టుబడులు రాకపోవడం వల్ల యువత జీవితం నాశనం అయింది. నేను ఫౌండేషన్ వేసిన కంపెనీలకు జగన్ మళ్లీ శంకుస్థాపన చేస్తున్నారు. ఇలాంటి పనులు సీఎం చేస్తే ఏపీలో ఉన్నవాళ్లంతా తిక్క వాళ్లే అనుకుని ఎవ్వరూ పెట్టుబడులు పెట్టడానికి రారు. ఏపీలో నిరుద్యోగం రేటు 6.15 కి పేరిగిపోయింది.రజనీకాంత్ ఏదో అంటే ఆయన మీద పడిపోయారు. ఆయన ఏపీకి వచ్చి స్వేచ్ఛగా మాట్లాడకూడదా? జగన్ గురించి.. ఈ ప్రభుత్వం గురించి ఒక్క మాటైనా మాట్లాడారా..? ఎన్టీఆర్ గురించి.. హైదరాబాద్ గురించి రజనీ మాట్లాడితే తప్పా? పవన్ నేను కలవకూడదా..? నేను పవన్ కలిస్తే భయమెందుకు..? ఉచ్చ పోసుకుంటున్నారా..? పొత్తులపై ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు 45 ఇయర్స్ ఇండస్ట్రీ నేను..ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో నాకు చెప్తారా? మన్మోహన్ సింగ్, బిల్ క్లింటన్ కూడా హైదరాబాద్ అభివృద్ధి ని పొగిడారు. యువత మేలుకోకుంటే జీవితం నాశనం అయిపోతుంది. ప్రభుత్వం పై వ్యతిరేకతతో చెప్పులు విసిరే పరిస్థితి వచ్చింది. సిగ్గు లేకుండా ప్రతి ఇంటికి స్టిక్కర్లు వేస్తున్నారు. కాపులతో నన్ను, పవన్ కళ్యాణ్ ను తిట్టిస్తున్నారు. మంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు చంద్రబాబు.
ఇప్పుడేం చేస్తారు?
ఇక సిట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన చంద్రబాబు.. ‘సిట్ వేసుకోనివ్వండి.. ఇన్నాళ్లేం చేశారు.? చాలా వెతికారు.. ఏం జరిగింది..? మా అకౌంట్లకు ఒక్క రూపాయైనా వచ్చిందా? జగన్ షెల్ అకౌంట్లకే డబ్బులు వచ్చాయి. సోలార్ విద్యుత్ కొనుగోళ్లల్లో ఏదో జరిగిందన్నారు.. ఏం చేశారు..? నాలుగేళ్లల్లో ఏం చేయలేకపోయారు.. ఇప్పుడేం చేయగలరు..? ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్, ఇన్సడైర్ ట్రేడింగ్ అన్నారు.. ఏం చేశారు? మేం క్లీన్ గా ఉన్నాం.. ఏం చేయలేరు’ అని చంద్రబాబు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..