Lance Naik Sai Teja: సాయితేజ ఫ్యామిలీకి లక్ష సాయం ప్రకటించిన చంద్రబాబు.. ప్రభుత్వం కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్

Army Chopper Crash: భారత దేశ చరిత్ర పుటల్లో చీకటి రోజు 2021 డిసెంబర్ 8వ తేదీ. ఆ రోజు భరతమాత.. తన ముద్దుబిడ్డలను ఆర్మీఅధికారులను కోల్పోయింది. తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో..

Lance Naik Sai Teja: సాయితేజ ఫ్యామిలీకి లక్ష సాయం ప్రకటించిన చంద్రబాబు.. ప్రభుత్వం కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
Chandrababu Sai Tej
Follow us
Surya Kala

|

Updated on: Dec 10, 2021 | 4:08 PM

Army Chopper Crash: భారత దేశ చరిత్ర పుటల్లో చీకటి రోజు 2021 డిసెంబర్ 8వ తేదీ. ఆ రోజు భరతమాత.. తన ముద్దుబిడ్డలను ఆర్మీఅధికారులను కోల్పోయింది. తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయి తేజ వీర మరణం పొందాడు. సాయి తేజ ఆకస్మిక మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిజేస్తున్నారు. సాయితేజ కుటుంబానికి అండగా నిలబడతామని అంటున్నారు. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సాయితేజ కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు.

సాయి తేజ భార్య శ్యామల, తమ్ముడు మహేష్ తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. తాము సాయి తేజ ఫ్యామిలీకి అన్ని విధాలా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అంతేకాదు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎస్  సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.  సాయి తేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌ నాయక్‌ సాయితేజకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని లేఖలో తెలిపారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం సాయితేజ కుటుంబాన్ని తక్షణమే అన్నివిధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో వీరమరణం పొందిన సాయితేజ కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాయి తేజ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సూచించారు. కేవలం తొమ్మిదేళ్లలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌కి సెక్యూరిటీగా సేవలందించే ఉన్నత స్థాయికి చేరుకున్న సాయితేజ సేవలను నాయుడు కొనియాడారు. గిరిజన కుటుంబంలో పుట్టిన సాయితేజ అంచెలంచెలుగా ఎదిగారని నాయుడు అన్నారు తమిళనాడులోని ఓ కార్యక్రమంలో పాల్గొనడగానికి వెళ్తున్న సమయంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులికతో పాటు.. రావత్ వ్యక్తి గత సిబ్బంది కూడా మరణించారు. ఈ ప్రమాదంలో ఆకస్మికంగా ఆర్మీ అధికారులు మరణించడంతో దేశ వ్యాప్తంగా విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిగత సిబ్బంది మృతులల్లో ఒకరు సాయితేజ. చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ ఆర్మీ జవాన్ నుంచి లాన్స్ నాయక్ గా పదవీని చేపట్టారు. బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరుగా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో సాయి తేజ్ వీరమరణం పొందారు. దీంతో సాయితేజ స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి.

Also Read:  పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదని సీఎం కు లేఖ రాసి.. ఆత్మహత్య చేసుకున్న అన్నదాత..