AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫొటో ఉంటే మీకొచ్చిన బాధేంటి.. పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..

ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో ప్రదర్శిస్తే.. మీకొచ్చిన బాధేంటి.. అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ పిటిషనర్‌ను ప్రశ్నించారు. దీంతో మీకేంటి సమస్య అంటూ.. ఆ పిటీషన్ ను కొట్టివేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు ప్రదర్శించడంపై పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫొటో ఉంటే మీకొచ్చిన బాధేంటి.. పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..
Pawan Kalyan
Shaik Madar Saheb
|

Updated on: Feb 11, 2026 | 1:50 PM

Share

ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో ప్రదర్శిస్తే.. మీకొచ్చిన బాధేంటి.. అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ పిటిషనర్‌ను ప్రశ్నించారు. దీంతో మీకేంటి సమస్య అంటూ.. ఆ పిటీషన్ ను కొట్టివేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు ప్రదర్శించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. విజయవాడకు చెందిన విశ్రాంత ఉద్యోగి ఏము కొండలరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి ఫోటో పెడితే మీకొచ్చిన బాధేంటని పిటిషనర్‌ను ప్రశ్నించిన.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ఉప ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగ హోదా లేదని, 12వేలకు పైగా సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషనర్ వాదించినా, ధర్మాసనం ఆ వాదనలను తిరస్కరించింది.

విజయవాడకు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి ఏము కొండలరావు వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.. అంతకుముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాజకీయ ప్రభావాన్ని చాటిచెప్పుకోవడానికి ప్రజాధనాన్ని ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని.. అని వాదించారు. ఆ వాదనలను తిరస్కరిస్తూ ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది.

అయితే.. ఇదే విషయంపై కొండలరావు ముందుగా ఏపీ హైకోర్టులో పిల్‌ వేశారు. హైకోర్టు దాన్ని కొట్టేయడంతో ఆ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా.. దీనిని ధర్మాసనం కొట్టివేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..