AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు కేసులను మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

స్కిల్‌ స్కామ్‌లో తనపై మోపిన అభియోగాలు కొట్టేయాలన్న చంద్రబాబు పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఫైబర్‌నెట్‌ కేసులో బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కూడా అదే రోజు జరగనుంది.

చంద్రబాబు కేసులను మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Chandrababu Cases
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 13, 2023 | 5:58 PM

స్కిల్‌ స్కామ్‌లో తనపై మోపిన అభియోగాలు కొట్టేయాలన్న చంద్రబాబు పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఫైబర్‌నెట్‌ కేసులో బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కూడా అదే రోజు జరగనుంది.

చంద్రబాబును అరెస్టు చేసిన స్కిల్‌ స్కామ్‌లో అత్యంత కీలకంగా మారిన సెక్షన్‌ 17Aపై సుప్రీంకోర్టులో జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేది నాలుగోసారి సుదీర్ఘ వాదనలు జరిగాయి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17A చంద్రబాబుకు వర్తించదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్‌ అడ్వకేట్‌ ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి నాలుగైదు హైకోర్టుల తీర్పులు కూడా ఇచ్చాయని వివరించారు. వర్తిస్తుందని చెప్పేందుకు ఏమైనా కోర్టు తీర్పులున్నాయా అని ధర్మాసనం ప్రశ్నకు అలాంటివి ఎక్కడా చూడలేదని ముకుల్‌ రోహత్గీ తెలిపారు.

అదే సమయంలో 17A అన్నది సెక్షన్‌ 19 తరహా సంపూర్ణ రక్షణ కాదని, నిజాయితీపరులైన అధికారులకు సెక్షన్‌ 17A అన్నది ఒక రక్షణ మాధ్యమమని అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు. సెక్షన్‌ 17A అమల్లోకి రాకముందే అంటే జూన్‌ 2018లోనే ఈ కేసు విచారణ మొదలైందని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో సందేహాలు తలెత్తినప్పుడు అవినీతి నిర్మూలన వైపే కోర్టులు మొగ్గు చూపాయని గుర్తు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఒక విజిల్ బ్లోయర్‌ కూడా గతంలో ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దీనికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్‌ మన్మోహన్‌సింగ్‌ కేసును ముకుల్‌ రోహత్గి ప్రస్తావించారు.

స్కిల్‌ స్కామ్‌ను సెబీ, ఆదాయపన్ను విభాగం మరెన్నో సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని కోర్టుకు తెలిపారు. దాదాపు గంటన్నర సేపు ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. తన వాదనలు పూర్తి చేయడానికి మరో ముప్పావు గంట పడుతుందని తెలిపారు. ఈ క్రమంలో కేసు విచారణను సోమవారం చేపడతామని న్యాయమూర్తులు సూచించారు. సోమవారం తాను హాజరుకాలేనని మంగళవారానికి వాయిదా వేయాలని రోహత్గి కోరడంతో కేసు విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది.

అటు ఫైబర్‌నెట్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కూడా వాదనలు జరిగాయి. పీటీ వారెంట్‌ను కోర్టు జారీ చేసిందని చంద్రబాబును సోమవారం అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులోనూ సెక్షన్‌ 17A వర్తిస్తుందని వాదించారు. బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఒక కేసులో అరెస్టు చేసిన తర్వాత చంద్రబాబుపై ఒకదాని తర్వాత మరొకటిగా కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఈ కేసు విచారణను కూడా మంగళ వారం వింటామని కోర్టు ప్రకటించింది. అప్పటి వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని లూథ్రా పదేపదే న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో బుధవారం వరకు అరెస్టు చేయమని CID తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గి న్యాయస్థానానికి హామీ ఇచ్చారు. పీటీ వారెంట్స్‌ అమలును వాయిదా వేసేలా ట్రయల్‌ కోర్టును కోరతామని సుప్రీంకోర్టుకు వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్.. ఎందుకో తెలుసా
SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్.. ఎందుకో తెలుసా
బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్.. నేషనల్‌ రేంజ్‌కి మన హీరోలు..
బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్.. నేషనల్‌ రేంజ్‌కి మన హీరోలు..
ఎండలో తిరుగుతున్నారా .. ఈ జాగ్రత్తలు తప్పని సరి వీడియో
ఎండలో తిరుగుతున్నారా .. ఈ జాగ్రత్తలు తప్పని సరి వీడియో
అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? వీడియో
అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? వీడియో
కొబ్బరి కాయల వ్యాను బోల్తా.. అక్కడి స్థానికులు ఏం చేశారంటే? వీడియ
కొబ్బరి కాయల వ్యాను బోల్తా.. అక్కడి స్థానికులు ఏం చేశారంటే? వీడియ
వాడిన నూనెను మళ్లీ వాడుతున్నారా? వీడియో
వాడిన నూనెను మళ్లీ వాడుతున్నారా? వీడియో
పహల్గామ్‌ ఉగ్రదాడిలో సంచలన విషయాలు.. చంపే ముందు ప్యాంటు విప్పి..
పహల్గామ్‌ ఉగ్రదాడిలో సంచలన విషయాలు.. చంపే ముందు ప్యాంటు విప్పి..
బిజినెస్ చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 లక్షల లోన్
బిజినెస్ చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 లక్షల లోన్
అలాంటి కామెంట్స్ పెడతారా? చాలా బాధగా ఉందన్న శేఖర్ మాస్టర్
అలాంటి కామెంట్స్ పెడతారా? చాలా బాధగా ఉందన్న శేఖర్ మాస్టర్
వాటికన్: పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత కొత్త పోప్ ఎవరు? వీడియో
వాటికన్: పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత కొత్త పోప్ ఎవరు? వీడియో