Crime: కొద్ది రోజుల్లోనే పెళ్లి.. అంతలోనే.. పాపం ఆ టీచర్..! అసలేం జరిగిందటే..?
ఆమె ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్..! కూలీ పనులు చేస్తున్న తండ్రికి చేదోడు.. వాదోడు గా నిలుస్తుంది. ఒక్కగానొక్క కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకొని పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారు తల్లిదండ్రులు.. అదే సమయంలో.. విధి చిన్న చూపు చూసింది. రోడ్డు దాటుతుండగా..బైక్ పై హై స్పీడ్‌లో వచ్చిన ఓ యువకుడు ఆమెను బలంగా ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలైంది. అక్కడికీ ఆమెను ఆసుపత్రికి తరలించడానికి స్థానికులు ప్రయత్నించారు.
ఆమె ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్..! కూలీ పనులు చేస్తున్న తండ్రికి చేదోడు.. వాదోడు గా నిలుస్తుంది. ఒక్కగానొక్క కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకొని పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారు తల్లిదండ్రులు.. అదే సమయంలో.. విధి చిన్న చూపు చూసింది. రోడ్డు దాటుతుండగా..బైక్ పై హై స్పీడ్‌లో వచ్చిన ఓ యువకుడు ఆమెను బలంగా ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలైంది. అక్కడికీ ఆమెను ఆసుపత్రికి తరలించడానికి స్థానికులు ప్రయత్నించారు. కానీ..! నంద్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం.. పొట్ట కూటి కోసం విశాఖకు వలస వచ్చింది. పెందుర్తిలో నివాసం ఉంటున్నారు. తండ్రి తాపీ మేస్త్రిగా, తల్లి చిరు వ్యాపారిగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి ఏకైక కుమార్తె ముల్లా షాహీదా.. చిన్నప్పటినుంచి రెక్కలు ముక్కలు చేసుకుని పెంచిన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలవాలి అనుకుంది. ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా చేరింది. ముల్లా షాహీదాకు ఇటీవల పెళ్ళి కుదిరింది. ఎంగేజ్‌మెంట్ కూడా చేసిన తల్లిదండ్రులు.. జనవరిలో పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పెళ్లి పనుల్లో భాగంగా విజయవాడకు వెళ్లారు. అయితే రోజు మాదిరిగా ఉదయాన్నే స్కూలుకు వెళ్ళింది షాహిదా. స్కూల్ నుంచి తిరిగి వస్తూ.. బిఆర్‌టీఎస్ రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. హై స్పీడ్ తో బైక్ పై దూసుకొచ్చిన యువకుడు ఒక్కసారిగా ఆమెను ఢీకొట్టాడు. దీంతో కాలితోపాటు శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కానీ.. మార్గ మధ్యంలోనే తుదిశ్వాస విడిచింది. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..