తెలుగు రాష్ట్రాల్లో భానుడు (Sun) విశ్వరూపం చూపిస్తు్న్నాడు. వేసవి ఆరంభంలోనే భగభగమంటూ చెమటలు కక్కిస్తున్నాడు. ఉదయం నుంచే ఎండ, ఉక్కపోతకు తోడు మధ్యాహ్నం సమయంలో వడ గాలులు వేడి పుట్టిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు (Temperature) పెరగడంతో ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఇవాళ కూడా వడగాలులు వీచే అవకాశం ఉందని తాజా ప్రకటనలో పేర్కొంది. విజయనగరం జిల్లా కొమరాడ, కురుపాం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని ప్రకటించింది. తెలంగాణలోనూ పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్ల మార్చి ఉష్ణోగ్రతల్లో ఇది కొత్త రికార్డ్. ఎల్లుండి వరకు రాష్ట్రంలో సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
విదర్భ నుంచి కేరళ వరకూ గాలులతో ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తున కొనసాగుతోంది. దీంతో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఎండవేడి కారణంగా నల్గొండ ప్రాంతంలో గాలిలో తేమ సాధారణం కన్నా 24 శాతం తక్కువై పొడి వాతావరణం ఏర్పడింది. ఎండ తీవ్రతతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Also Read
KTR: మినిస్టర్ కేటీఆర్ పక్కన కిర్రాక్ లుక్‌తో ఉన్న ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టగలరా..?
Coral Reefs: మనుషుల శవాలతో సముద్రం అడుగున పగడపు దిబ్బల ఏర్పాటు.. కాన్సెప్ట్ సూపర్ అంటున్న నెటిజన్లు