మెగా ఫ్యామిలీపై “వాల్మీ’కి వార్
వాల్మీకి టైటిల్‌పై వివాదం రాజుకుంటోంది. ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ వద్ద వాల్మీకి సంఘాలు ఆందోళన చేపట్టారు. మెగాస్టార్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తూ..నగరంలో వాల్మీకి సంఘాలు భారీ ర్యాలీ చేపట్టారు. నగరంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద వాల్మీకి మహర్షి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి పేరును కించపరిచే విధంగా ఈ సినిమా చిత్రీకరించారని వారు మండిపడ్డారు. ఈ చిత్రం పేరును వెంటనే మార్చుకోవాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా […]
వాల్మీకి టైటిల్‌పై వివాదం రాజుకుంటోంది. ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ వద్ద వాల్మీకి సంఘాలు ఆందోళన చేపట్టారు. మెగాస్టార్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తూ..నగరంలో వాల్మీకి సంఘాలు భారీ ర్యాలీ చేపట్టారు. నగరంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద వాల్మీకి మహర్షి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి పేరును కించపరిచే విధంగా ఈ సినిమా చిత్రీకరించారని వారు మండిపడ్డారు. ఈ చిత్రం పేరును వెంటనే మార్చుకోవాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మెగాస్టార్ చిరంజీవి, నాగబాబును వాల్మీకి సంఘాలు హెచ్చరించారు. వాల్మీకి అంటే గొప్ప కవి, సమాజానికి మార్గదర్శకమని అన్నారు. అలాంటి మహా నాయకుల పేరుతో ఇలాంటి చిత్రాలు చేయడం దారుణమన్నారు.