AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైలంలో విషాదం.. అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య!

నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన వీరు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అన్నదాన సత్రంలో జరిగిన ఈ ఘటనపై శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీశైలంలో విషాదం.. అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య!
Family Suicide In Srisailam
Balaraju Goud
|

Updated on: Aug 25, 2026 | 12:43 PM

Share

నంధ్యాల జిల్లా శ్రీశైలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.. సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన కుటుంబంగా గుర్తింపు.. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నంద్యాల జిల్లా శ్రీశైలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలోని ఓ గదిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతులను సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామంలోని వడ్డే కాలనీకి చెందిన పల్లపు సుధాకర్ (36), పల్లపు ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15)గా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒకరు బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆగస్టు 20వ తేదీన ఐదుగురు కలిసి ఆటోలో శ్రీశైలానికి చేరుకున్నారు. వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో 11వ నంబర్ గదిని తీసుకుని అక్కడే బస చేశారు. అయితే మూడు రోజులుగా గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో సత్రం నిర్వాహకులకు అనుమానం వచ్చింది. గది నుంచి దుర్వాసన రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా భయానక దృశ్యం కనిపించింది. బాత్రూమ్‌లో ముగ్గురు మహిళలు ఉరివేసుకుని ఉండగా, గదిలోని ఫ్యాన్‌కు ఇద్దరు పురుషులు ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. దీంతో పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల్లో పల్లపు సుధాకర్ సుమారు 36 ఏళ్ల వయసున్న వ్యక్తిగా, పల్లపు ఆదిలక్ష్మి, పల్లపు మల్లేశ్వరి, పల్లపు శ్రీదేవి, గోగుల మణికంఠగా పోలీసులు గుర్తించారు. వీరంతా బత్తలపల్లి ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపారు.

కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. సుమారు నెల రోజుల క్రితం గోగుల శ్రీదేవికి పక్షవాతం రావడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు విరూపాక్షపురానికి వెళ్లారు. అక్కడి నుంచి ఐదుగురూ కలిసి శ్రీశైలానికి వెళ్లినట్లు తెలుస్తోంది. బంధువులు ఫోన్‌లో మాట్లాడిన సమయంలో తాము శ్రీశైలంలో ఉన్నామని చెప్పినట్లు సమాచారం.

అయితే ఐదుగురూ ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడటానికి అసలు కారణం ఏమిటన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే మృతుల బంధువులకు కూడా ఆత్మహత్యకు కచ్చితమైన కారణం తెలియదని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన శ్రీశైలం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గది నుంచి లభించిన ఆధారాలు, ఫోన్ కాల్ వివరాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us