AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నాన్న నాటిన జ్ఞాపకం.. చెట్టు కోసం ఏకంగా ఇంటి ప్లాన్‌నే మార్చేసిన కొడుకులు

నాన్నంటే ఒక జ్ఞాపకం కాదు.. నిత్యం మనతోనే ఉండే ఒక ప్రాణం.. కొత్త ఇంటి నిర్మాణానికి అడ్డు వచ్చిందని చాలామంది చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేస్తుంటారు. కానీ ఈ కొడుకులు మాత్రం తండ్రి నాటిన చెట్టు కోసం ఏకంగా ఇంటి ప్లాన్‌నే మార్చేశారు. కడప జిల్లాలో తండ్రి జ్ఞాపకాన్ని కాపాడుకున్న ఆ కొడుకుల కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Andhra Pradesh: నాన్న నాటిన జ్ఞాపకం.. చెట్టు కోసం ఏకంగా ఇంటి ప్లాన్‌నే మార్చేసిన కొడుకులు
Sons Build House Around Tree
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Sep 27, 2026 | 7:05 PM

Share

కన్నవారిపై ప్రేమను చాటుకోవడానికి భారీ విగ్రహాలు పెట్టక్కర్లేదు, పదిమందికీ ఆదర్శంగా నిలిచే ఒక మంచి పని చేస్తే చాలని నిరూపించారు ఆ కొడుకులు. కంటికి రెప్పలా పెంచిన నాన్న జ్ఞాపకంగా నాటిన చెట్టును నరకడానికి వారి మనసు ఒప్పలేదు. కొత్త ఇంటి నిర్మాణానికి అడ్డుగా వచ్చినా సరే, గొడ్డలి వేటు వేయకుండా ఆ చెట్టునే తమ ఇంటిలో అంతర్భాగంగా మార్చేసి తండ్రిపై తమకున్న మైన ప్రేమను, ప్రకృతిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ సాహెబ్ కొన్నేళ్ల క్రితం తమ ఇంటి ఆవరణలో ఒక వేప మొక్కను నాటారు. ఆయన దానిని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచారు. కాలక్రమంలో మహబూబ్ సాహెబ్ కన్నుమూశారు. తండ్రి భౌతికంగా దూరమైనా, ఆయన నాటిన ఆ వేప చెట్టును ఆయన రూపంగానే భావించిన కుమారులు బాషా, రఫీలు దానికి నిత్యం నీళ్లు పోస్తూ ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వచ్చారు.

ఇంటి ప్లాన్‌నే మార్చేసిన చెట్టు ప్రేమ

ఇటీవల పాత ఇంటి స్థానంలో కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించిన ఆ సోదరులకు వేప చెట్టు ప్రధాన అడ్డంకిగా మారింది. సాధారణంగా ఎవరైనా ఆ చెట్టును నరికేసి ఇల్లు కట్టేసుకునేవారు. కానీ బాషా, రఫీలకు మాత్రం తండ్రి స్వయంగా నాటిన ఆ చెట్టును నరకడం తండ్రినే నరికేసినంత బాధ కలిగించింది. దీంతో ఇంజనీర్‌తో మాట్లాడి ఇంటి ప్లాన్‌నే మార్చేశారు. చెట్టుకు ఎటువంటి నష్టం కలగకుండా దాని ఎదుగుదలకు అనువుగా చుట్టూ ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు.

ఆ చెట్టే మా నాన్న.. రోజూ ఆయన్నే చూసుకుంటున్నాం

‘‘మా నాన్న భౌతికంగా మా మధ్య లేకపోయినా, ఈ వేప చెట్టు రూపంలో ప్రతిరోజూ మాకు కనిపిస్తూనే ఉన్నారు. ఆయన జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యమైన ఈ చెట్టును నరకడం మా వల్ల కాలేదు. చెట్టు కోసం కొద్దిగా స్థలం తగ్గినా మాకు బాధ లేదు, నాన్న ప్రేమ మా ఇళ్లంతా నిండి ఉన్న భావన కలుగుతోంది’’ అని కుమారులు బాషా, రఫీ భావోద్వేగంతో తెలిపారు.

తండ్రిపై అంతులేని ప్రేమతో పాటు, చెట్లను నరికేస్తున్న నేటి సమాజంలో పచ్చదనాన్ని కాపాడుతూ ఈ సోదరులు తీసుకున్న నిర్ణయం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీరి ఆదర్శాన్ని చూసి గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us
పోషకాల ఖజానా మటన్ లివర్ సెట్.. సింపుల్‌గా ఇలా చేస్తే..
పోషకాల ఖజానా మటన్ లివర్ సెట్.. సింపుల్‌గా ఇలా చేస్తే..
కారులో ఏదో తేడాగా ఉందని చెక్ చేసిన పోలీసులు షాక్!
కారులో ఏదో తేడాగా ఉందని చెక్ చేసిన పోలీసులు షాక్!
పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ ప్రకటన
పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ ప్రకటన
ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి దారుణ హత్య.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమా
ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి దారుణ హత్య.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమా
హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. ఐపీఎల్‌ 2027 వరకు క్రికెట్‌కు దూరం?
హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. ఐపీఎల్‌ 2027 వరకు క్రికెట్‌కు దూరం?
టాలెంట్ ఉన్నా వెలుగులోకి రాలేకపోయిన ఏడుగురు క్రికెటర్లు వీళ్లే
టాలెంట్ ఉన్నా వెలుగులోకి రాలేకపోయిన ఏడుగురు క్రికెటర్లు వీళ్లే
జియో మెగా ఐపీవో సునామీ.. ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో స్పందన
జియో మెగా ఐపీవో సునామీ.. ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో స్పందన
అందుకే ఆ ఫ్లాప్ తర్వాత ఆ డైరెక్టర్‌తో సినిమా చేయలేదు..
అందుకే ఆ ఫ్లాప్ తర్వాత ఆ డైరెక్టర్‌తో సినిమా చేయలేదు..
ఐదు సూపర్‌ఫాస్ట్ రైళ్లలో కొత్త సేవలు.. ఏఐ టెక్నాలజీతో క్లీనింగ్..
ఐదు సూపర్‌ఫాస్ట్ రైళ్లలో కొత్త సేవలు.. ఏఐ టెక్నాలజీతో క్లీనింగ్..