Andhra Pradesh: మంత్రి పదవి రావాలంటూ మంత్రాలయంలో ప్రత్యేక పూజలు.. ఇంతకీ ఎవరి కోసమో తెలుసా..?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నారని, తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయబోతున్నారనే పొలిటికల్ టాక్ వినిపిస్తున్న..

Andhra Pradesh: మంత్రి పదవి రావాలంటూ మంత్రాలయంలో ప్రత్యేక పూజలు.. ఇంతకీ ఎవరి కోసమో తెలుసా..?
Ycp
Follow us

|

Updated on: Oct 13, 2021 | 9:45 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నారని, తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయబోతున్నారనే పొలిటికల్ టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆశావహులు మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరోవైపు వారి అనుచరులు కూడా తమ నేతకు మంత్రి పదవి దక్కాలంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పూజలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కి మంత్రి పదవి రావాలని కోరుతూ గ్రామ దేవత మంచాలమ్మదేవికి, శ్రీ రాఘవేంద్రస్వామికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 216 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.

మూడు నెలల క్రితం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుతూ.. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్ భాగ్యమ్మ తమ అనుచరులతో కలిసి ఉరుకుందు ఈరన్న దేవస్థానం నుండి కోసిగి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఇక మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే తనయుడు ధరణి రెడ్డి అనుచరులు “ధరణి సైన్యం” పేరుతో ఉరుకుందు దేవస్థానం నుండి శ్రీశైలం వరకు బైక్ యాత్ర నిర్వహించారు. ఇవాళ మంత్రాలయం ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుతూ గ్రామ దేవత మంచాలమ్మకు, శ్రీ రాఘవేంద్రస్వామికి శ్రీ మఠం ప్రాంగణం లో 216 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అంతేకాదు.. మంత్రాలయం ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కాలంటూ గ్రామ గ్రామాల్లో పూజలు, ధానాలు చేస్తున్నారు.

Also read:

News Watch: కోతలొద్దు, మా వాటా వాడుకోండి , తొందర్లోనే పిల్లలకు టీకా.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

Viral Video: మనిషి స్వార్ధానికి పరాకాష్ట ఈ ఘటన..! చెట్లు నాటడం ఛాలెంజ్ ఓ వైపు.. చెట్లు పీకేయడం మరో వైపు.. (వీడియో)

RTA Rides: సీజనల్ బాదుడుకు ఆర్టీఏ అధికారుల కత్తెర.. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ బస్సులపై కేసులు..