కిడ్నీ విక్రయంపై ప్రభుత్వం సీరియస్.. నిందితుల కోసం పోలీసుల గాలింపు..

బెజవాడ, గుంటూరు కేంద్రంగా సాగుతోన్న ఈ కిడ్నీ దందా ఇప్పుడు ఏపీలో సంచలనం రేపుతోంది. ఇడ్లీలు అమ్మినంత ఈజీగా కిడ్నీలు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్లను టార్గెట్‌గా చేసుకొని వల విసురుతోంది కిడ్నీ మాఫియా. ఒక్క కిడ్నీ ఇస్తే చాలు లైఫ్‌ సెటిలైపోద్ది అంటూ ఎరవేయడంతో నమ్మి మోసపోతున్నారు బాధితులు. కిడ్నీ గ్యాంగ్‌ కోసం వేట మొదలైంది. బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో యాక్షన్‌లోకి దిగారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని కిడ్నీ దందా వెనుకున్న బ్రోకర్లు బాషా, వెంకట్‌ కోసం గాలింపు ప్రారంభించారు.

కిడ్నీ విక్రయంపై ప్రభుత్వం సీరియస్.. నిందితుల కోసం పోలీసుల గాలింపు..
Guntur
Follow us

|

Updated on: Jul 10, 2024 | 9:11 AM

బెజవాడ, గుంటూరు కేంద్రంగా సాగుతోన్న ఈ కిడ్నీ దందా ఇప్పుడు ఏపీలో సంచలనం రేపుతోంది. ఇడ్లీలు అమ్మినంత ఈజీగా కిడ్నీలు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్లను టార్గెట్‌గా చేసుకొని వల విసురుతోంది కిడ్నీ మాఫియా. ఒక్క కిడ్నీ ఇస్తే చాలు లైఫ్‌ సెటిలైపోద్ది అంటూ ఎరవేయడంతో నమ్మి మోసపోతున్నారు బాధితులు. కిడ్నీ గ్యాంగ్‌ కోసం వేట మొదలైంది. బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో యాక్షన్‌లోకి దిగారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని కిడ్నీ దందా వెనుకున్న బ్రోకర్లు బాషా, వెంకట్‌ కోసం గాలింపు ప్రారంభించారు. మొత్తం నాలుగు బృందాలతో ఆపరేషన్‌ స్టార్‌ చేశారు గుంటూరు పోలీసులు. ఇప్పటికే వెంకట్ సుబ్రమణ్యంలను గుర్తించారు పోలీసులు. బాషా కోసం గాలింపు ముమ్మరం చేశారు. నిందితుడు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. విజయవాడలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జరిగిన విజయ ఆస్పత్రికి ఈరోజు వెళ్లి వివరాలు సేకరించనున్నారు. గతంలోనూ విజయవాడ-గుంటూరు కేంద్రంగా కిడ్నీ మాఫియా అరాచకాలు బయటపడటంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు.

ఈ రాకెట్‌ వెనుక ఎవరెవరి ఇన్వాల్‌మెంట్‌ ఉందో తేల్చే పనిలో పడ్డారు. హోంమంత్రి అనిత సైతం కిడ్నీ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే కిడ్నీ బాధితుడు మధుబాబుకు మెరుగైన వైద్యం కోసం జిజిహెచ్‎కు తరలించిన పోలీసులు. గార్లపాటి మధుబాబుకు పెళ్లైంది ఇద్దరు పిల్లలున్నారు. ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పరచుకుని కిడ్నీ అమ్మకంపై మాయ మాటలు చెప్పారు. డబ్బుల కోసం నిందితుడిని నిలువునా దోచేశారు. ముప్పై లక్షలు ఇస్తామని ఆశచూపి మోసం చేశారు. రికార్డులు తారుమారు చేశారు. జూన్ 15న విజయవాడలోని విజయా సూపర్ స్పెషాటిలీ ఆసుపత్రిలో కిడ్నీ ఆపరేషన్ చేశారు. అంతా అయిపోయాక లక్షా పదివేల రూపాయలు మాత్రమే చేతిలో పెట్టారు. బాధితుడు మధుబాబు మిగిలిన డబ్బులు ఇవ్వాలంటూ.. మధ్యవర్తి వెంకట్‎ను అడగటం మొదలు పెట్టాడు. అయితే రక్త సంబంధీకుడుగానే కిడ్ని ఇచ్చావని నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ బాధితుడితో వెంకట్ ఎదురు తిరిగాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న మధుబాబు రెండు రోజుల క్రితం గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బిగ్‍బాస్ 8 కోసం కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్..
బిగ్‍బాస్ 8 కోసం కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్..
డిగ్రీ అర్హతతో 17,727 కేంద్ర కొలువులు..2 రోజుల్లోముగుస్తున్నగడువు
డిగ్రీ అర్హతతో 17,727 కేంద్ర కొలువులు..2 రోజుల్లోముగుస్తున్నగడువు
షుగర్‌ టెస్ట్ ఏ సమయంలో చేసుకుంటే మంచిది..
షుగర్‌ టెస్ట్ ఏ సమయంలో చేసుకుంటే మంచిది..
మూసి ఉన్న ఇల్లు.. తలుపు తెరవగానే బయటకు వచ్చిన 26 కొండచిలువలు..
మూసి ఉన్న ఇల్లు.. తలుపు తెరవగానే బయటకు వచ్చిన 26 కొండచిలువలు..
మళ్లీ అమ్మవుతోన్న బాపు బొమ్మ.. బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత
మళ్లీ అమ్మవుతోన్న బాపు బొమ్మ.. బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత
జులై 26, 27 తేదీల్లో గురుకుల విద్యాలయాల్లో స్పాట్‌ అడ్మిషన్లు
జులై 26, 27 తేదీల్లో గురుకుల విద్యాలయాల్లో స్పాట్‌ అడ్మిషన్లు
రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ. 500 బోనస్‌తో పాటు..
రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ. 500 బోనస్‌తో పాటు..
వాడేసిన టీ పొడిని పడేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే అస్సలు పడేయరు
వాడేసిన టీ పొడిని పడేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే అస్సలు పడేయరు
మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌..
మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌..
బాదం తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా ?? నిపుణులు ఏమంటున్నారు ??
బాదం తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా ?? నిపుణులు ఏమంటున్నారు ??