Watch Video: పాఠం చెబుతుండగా పెద్ద శబ్ధం.. ఉలిక్కిపడిన టీచర్.. భయాందోళనలో విద్యార్థులు..
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి నేలపడడంతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తూ విద్యార్థులు ఆ ప్రాంతంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూనవరం మండలంలోని పెదార్కూరు పంచాయతీ పరిధిలోని బండారు గూడెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి నేలపడడంతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తూ విద్యార్థులు ఆ ప్రాంతంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూనవరం మండలంలోని పెదార్కూరు పంచాయతీ పరిధిలోని బండారు గూడెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు.. విద్యార్థులకు యధావిధిగా పాఠం బోధిస్తుండగా హఠాత్తుగా పాఠశాల భవనం పైకప్పు నుంచి పెద్ద శబ్దం వచ్చింది.
వెంటనే పెచ్చులు ఊడి కింద పడటంతో విద్యార్థులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో పాఠశాల తరగతి గదిలో విద్యార్థులను కూర్చో పెట్టేందుకు భయపడుతున్నారు టీచర్లు. దీంతో గద్యంతరం లేక స్కూల్ కు వచ్చిన పిల్లలకు ఆరుబయట స్కూల్ కాంపౌండ్లో చాపవేసి కూర్చోబెట్టి బోధన చేపట్టారు టీచర్లు. ఓపెన్ టాప్ స్కూల్ తరహాలో బ్లాక్ బోర్డు ఏర్పాటు చేసి మట్టి నేలపై పాఠాలు చెప్పారు. ఈ ఘటనపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని నూతన పాఠశాల భవననిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికే భవనం శిధిలావస్థకు చేరుకున్నప్పటికీ అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. ఒక వేళ భారీగా వర్షం పడితే పాఠశాల భవనం నుండి వర్షపు నీరు కూడా కరుతుందని టీచర్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..