Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు శుభవార్త.. పట్టాలెక్కనున్న మరిన్ని ప్రత్యేక రైళ్లు..!

Special Trains From April 1: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ క్రమక్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోంది....

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు శుభవార్త.. పట్టాలెక్కనున్న మరిన్ని ప్రత్యేక రైళ్లు..!
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 30, 2021 | 8:23 PM

Special Trains From April 1: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ క్రమక్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణ మధ్య రైల్వే నేటి నుంచి మరో 30 రైళ్లను నడపనుంది. వాస్తవానికి ఈ రైళ్లను మార్చి నెలాఖరు దాకా నడపాల్సి ఉండగా.. తాజాగా రైల్వేశాఖ ఆ గడువును మరికొన్ని నెలలు పొడిగించింది.

రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..

  • విశాఖపట్నం – లింగపల్లి(02831): ఈ డైలీ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది.
  • లింగపల్లి – విశాఖపట్నం(02832): ఈ డైలీ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 2 నుంచి జూలై 1 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది.
  • విశాఖపట్నం – కడప(07488) – ఈ డైలీ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది.
  • కడప – విశాఖపట్నం(07487) – ఈ డైలీ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 2 నుంచి జూలై 1 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది.
  • హౌరా – యశ్వంత్‌పూర్(02873) – ఈ డైలీ మెయిల్ ఎక్స్‌ప్రెస్ మార్చి 30 నుంచి జూన్ 28 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది.
  • యశ్వంత్‌పూర్ – హౌరా(02874) – ఈ డైలీ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది.
  • భువనేశ్వర్ – తిరుపతి( 08479) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 3 నుంచి జూన్ 26 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ శనివారం నడుస్తుంది.
  • తిరుపతి – భువనేశ్వర్(08480) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ ఆదివారం నడుస్తుంది.
  • భువనేశ్వర్ – చెన్నై సెంట్రల్(02839) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ గురువారం నడుస్తుంది.
  • చెన్నై సెంట్రల్ – భువనేశ్వర్(02840) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ శుక్రవారం నడుస్తుంది.
  • భువనేశ్వర్ – బెంగళూరు(02845) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ ఆదివారం నడుస్తుంది.
  • బెంగళూరు- భువనేశ్వర్(02846) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ సోమవారం నడుస్తుంది.
  • భువనేశ్వర్ – పుదుచ్చేరి(02898) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ మంగళవారం నడుస్తుంది.
  • పుదుచ్చేరి- భువనేశ్వర్(02897) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ బుధవారం నడుస్తుంది.
  • భువనేశ్వర్ – రామేశ్వరం(08496) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ శుక్రవారం నడుస్తుంది.
  • రామేశ్వరం – భువనేశ్వర్(08495) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ ఆదివారం నడుస్తుంది.
  •  పూరీ నుంచి చెన్నై సెంట్రల్(02859) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ ఆదివారం నడుస్తుంది.
  • చెన్నై సెంట్రల్ నుంచి పూరీ (02860) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ సోమవారం నడుస్తుంది.
  • విశాఖపట్నం నుంచి హజ్రత్ నిజాముద్దీన్ ( 02852) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 2 నుంచి జూన్ 28 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ సోమవారం, శుక్రవారం నడుస్తుంది.
  • హజ్రత్ నిజాముద్దీన్ నుంచి విశాఖపట్నం(02851) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 4 నుంచి జూన్ 30 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ బుధవారం, ఆదివారం నడుస్తుంది.
  • విశాఖపట్నం నుంచి చెన్నై సెంట్రల్(02869) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ సోమవారం నడుస్తుంది.
  • చెన్నై సెంట్రల్ నుంచి విశాఖపట్నం(02870) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ మంగళవారం నడుస్తుంది.
  • విశాఖపట్నం నుంచి గాంధీధామ్(08501) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ మంగళవారం నడుస్తుంది.
  • గాంధీధామ్ నుంచి విశాఖపట్నం(08502) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ ఆదివారం నడుస్తుంది.
  • హతియా నుంచి యశ్వంత్‌పూర్(02835) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ మార్చి 30 నుంచి జూన్ 22 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ మంగళవారం నడుస్తుంది.
  • యశ్వంత్‌పూర్ నుంచి హతియా(02836) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ గురువారం నడుస్తుంది.
  • హౌరా నుంచి పుదుచ్చేరి( 02867) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ ఆదివారం నడుస్తుంది.
  • పుదుచ్చేరి నుంచి హౌరా(02868) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ బుధవారం నడుస్తుంది.
  • హౌరా నుంచి ఎర్నాకుళం(02877) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ శనివారం నడుస్తుంది.
  • ఎర్నాకుళం నుంచి హౌరా(02878) – ఈ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 26 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ సోమవారం నడుస్తుంది.

ఏప్రిల్ 1 నుంచి నడవనున్న మరిన్ని స్పెషల్ ట్రైన్స్ వివరాలివే…

సికింద్రాబాద్ – కర్నూలు సిటీ(మెయిల్ ఎక్స్‌ప్రెస్): ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సికింద్రాబాద్‌లో ఉదయం 7.40 గంటలకు బయల్దేరి.. కర్నూలు సిటీకి మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుతుంది.

కర్నూలు సిటీ- సికింద్రాబాద్(మెయిల్ ఎక్స్‌ప్రెస్): ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కర్నూలు సిటీలో మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి.. సికింద్రాబాద్‌కు రాత్రి 7.50 గంటలకు చేరుతుంది.

తిరుపతి – వాస్కోడగామా(మెయిల్ ఎక్స్‌ప్రెస్): ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ తిరుపతిలో ఉదయం 11.40 గంటలకు బయల్దేరి.. వాస్కోడగామాకు మరుసటి రోజు ఉదయం 5.25 గంటలకు చేరుతుంది. ఈ ట్రైన్ ప్రతీ గురువారం నడుస్తుంది.

వాస్కోడగామా- తిరుపతి(మెయిల్ ఎక్స్‌ప్రెస్): ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వాస్కోడగామాలో ఉదయం 9 గంటలకు బయల్దేరి.. తిరుపతికి మరుసటి రోజు తెల్లారుజామున 2.55 గంటలకు చేరుతుంది. ఈ ట్రైన్ ప్రతీ శుక్రవారం నడుస్తుంది.

హైదరాబాద్ – వాస్కోడగామా(మెయిల్ ఎక్స్‌ప్రెస్): ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ హైదరాబాద్‌లో ఉదయం 9 గంటల 15 నిమిషాలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 5 గంటల 25 నిమిషాలకు వాస్కోడగామాకు చేరుతుంది.

వాస్కోడగామా – హైదరాబాద్(మెయిల్ ఎక్స్‌ప్రెస్): ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వాస్కోడగామాలో ఉదయం 9 గంటలకు బయల్దేరి.. హైదరాబాద్‌కు మరుసటి రోజు ఉదయం 7 గంటల .20 నిమిషాలకు చేరుతుంది.

Also Read:

చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!