AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూడగా కంగుతిన్న భక్తులు..

శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న పాములు తరచూ భక్తులను భయపెడుతున్నాయి. నడక దారి భక్తులకు పలు రకాల విష సర్పాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే అలిపిరి నడక మార్గంలో ఉన్న రాములవారి ఆలయ పోటులో పాము కనిపించింది. దాదాపు 8 అడుగుల పొడవైన జెర్రిపోతు ఆలయ సిబ్బంది కంటపడింది.

రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూడగా కంగుతిన్న భక్తులు..
Snake In The Sri Ram Temple
Raju M P R
| Edited By: |

Updated on: Apr 18, 2025 | 8:37 PM

Share

శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న పాములు తరచూ భక్తులను భయపెడుతున్నాయి. నడక దారి భక్తులకు పలు రకాల విష సర్పాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే అలిపిరి నడక మార్గంలో ఉన్న రాములవారి ఆలయ పోటులో పాము కనిపించింది. దాదాపు 8 అడుగుల పొడవైన జెర్రిపోతు ఆలయ సిబ్బంది కంటపడింది. పాదాల మండపం సమీపంలోనే ఉన్న ఆలయ పోటులోకి వెళ్ళిన పామును చూసిన భక్తులు, సిబ్బంది హడలిపోయి బయటకు పరుగులు పెట్టారు. వెంటనే టీటీడీ ఫారెస్ట్ విభాగంలో పనిచేస్తున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు.

పాముకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు చేత్తో పాము పట్టుకుని బయటకు తీసుకెళ్ళాడు. అక్కడున్న ఆలయ సిబ్బంది, భక్తులు పామును చూసి భయంతో వణికిపోగా పామును పట్టుకున్న భాస్కర్ నాయుడు మాత్రం సాఫీగా పాముతో ఆడుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. పాము ఏమి చేయదని తాకమని చెప్పి ఆలయ సిబ్బందికి చూపాడు. ఆలయం బయట పార్క్ చేసిన బైక్ వద్దకు పామును తీసుకెళ్లి బ్యాగ్ లో వేసుకుని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో పాము భయాన్ని వీడిన భక్తులు, ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..