చిరుధాన్యాల్లో యేసు జీవిత తుది ఘట్టాలు.. కళారూపానికి జీవం పోసిన సూక్ష్మ కళాకారుడు!
విశాఖకు చెందిన ప్రముఖ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ రైల్వే ఉద్యోగి. కానీ కళ్ళపై మొక్కులతో చిరుధాన్యాలతో కళారూపాలు చేయడం హాబీగా మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే హెల్త్ ఆర్ట్ పేరుతో ప్రముఖుల చిత్రాలు సామాజిక స్పృహను కలిగించే కళారూపాలు చేశారు. చిరుధాన్యాల ప్రాముఖ్యత చిత్రకళ రూపంలో ప్రపంచ దేశాలకు వివరిస్తున్నారు విజయ్ కుమార్. అది కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయ ఆహారంలో భాగమైన చిరుధాన్యాలతో అద్భుత కళారూపాలను తీర్చిదిద్దుతారు.

గుడ్ ఫ్రైడే.. గ్రేట్ ఫ్రైడే.. బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలువబడే రోజు ఇది. క్రైస్తవులకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగిన రోజు. గుడ్ ఫ్రైడే.. మానవాళి విముక్తి కోసం యేసుక్రీస్తు బాధ, త్యాగాన్ని సూచిస్తుంది. యేసును ఆరోజు శిలువ వేస్తారు. గుడ్ ఫ్రైడే రోజు ప్రార్థనలు చేస్తారు. శుక్రవారం రోజున ఎటువంటి సంబరాలు సంతోషాలు చేయరు. యేసు క్రీస్తుకు మరణ శిక్ష వేసినప్పటి నుంచి.. సమాధి చేసే వరకు ఆయన అనుభవించిన బాధను స్మరించుకుంటూ విషాద ఘడియలను గడుపుతారు. ఆధ్యాత్మిక ప్రత్యేకత కలిగిన గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని.. విశాఖకు చెందిన సూక్ష్మ కళాకారుడు.. తమదైన శైలిలో భక్తి భావాన్ని చాటుకున్నాడు. 14 ఘట్టాలను ప్రతిబింబించేలా.. చిరుధాన్యాలతో చిత్రాలను రూపొందించాడు.
విశాఖకు చెందిన ప్రముఖ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ రైల్వే ఉద్యోగి. కానీ కళ్ళపై మొక్కులతో చిరుధాన్యాలతో కళారూపాలు చేయడం హాబీగా మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే హెల్త్ ఆర్ట్ పేరుతో ప్రముఖుల చిత్రాలు సామాజిక స్పృహను కలిగించే కళారూపాలు చేశారు. చిరుధాన్యాల ప్రాముఖ్యత చిత్రకళ రూపంలో ప్రపంచ దేశాలకు వివరిస్తున్నారు విజయ్ కుమార్. అది కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయ ఆహారంలో భాగమైన చిరుధాన్యాలతో అద్భుత కళారూపాలను తీర్చిదిద్దుతారు.
గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని ఏసుక్రీస్తు జీవితానికి సంబంధించిన 14 సంఘటనలతో కూడిన మిల్లెట్ ఆర్ట్ చిత్రాలను విశాఖకు చెందిన చిరుధాన్యాల చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ తీర్చిదిద్దారు. వీటిని ఎన్ఏడి జంక్షన్ వద్దనున్న సెయింట్ థామస్ చర్చ్ (పునీత తోమాసు వారి ఆలయంలో) ప్రదర్శనకు ఉంచారు. ఏసుక్రీస్తు ను శిలువ వేసే సందర్భంలో జరిగిన 14 ప్రధాన ఘట్టాలను ప్రతిబింబిస్తూ ఈ చిత్రాలను తయారు చేశారు. అరికెలు, సజ్జలు రాగులు, సామలు, నల్ల సామలు వంటి చిరుధాన్యాలను వినియోగించి.. దాదాపు నెలరోజులపాటు శ్రమించి మోకా విజయకుమార్ ఎంతో సహజ సిద్ధంగా వీటిని తీర్చి దిద్దారు.
వీడియో చూడండి..
చిత్రాల్లో సజీవంగా ఘట్టాలు..

Jesus Life In Small Grains
మోకా విజయ్ కుమార్.. చిరుధాన్యాలతో చిత్రాలను సజీవంగా రూపొందించారు. 14 ఘట్టాల్లో యేసుప్రభువు మరణతీర్పు పొందటం నుంచి మొదలుకుని.. ప్రభువు సిలువ మోయడం, యేసుప్రభువు మొదటిసారి శిలువ కింద బోర్లాపడటం, దివ్యమాతకు ఎదురుపడటం, శిలువను మోయటానికి సిరేనియా సిమోను సహకారం, ప్రభువు ముఖమును వెరోనికమ్మ తుడువడం, యేసుప్రభువు రెండవసారి శిలువ క్రింద బోర్లపడటం, పుణ్యస్త్రీలకు ఊరట చెప్పటం, మూడవసారి శిలువ కింద బోర్లపడటం, ప్రభువు వస్త్రాలు తీయడం, యేసును స్లీవ మీద కొట్టడం, శిలువ మీద మృతి చెందడం, శిలువ నుండి దింపడం, యేసుప్రభు శరీరమును సమాధిలో ఉంచడం వంటి ఘట్టాలు చిత్రాల రూపంలో ప్రజల ముందు ఉంచారు మిల్లెట్ ఆర్టిస్ట్ విజయకుమార్.
వాటికన్ సిటీకి చిత్రాలు పంపాలని..
ఈ చిత్రాలను దేశవ్యాప్తంగా విభిన్న ప్రముఖ ప్రాంతాలలో ప్రదర్శనగా ఉంచి వాటికన్ సిటీ పోప్ కి భారతదేశం తరఫున బహుమతిగా అందించాలని తన కోరుకుంటున్నట్లు విజయ కుమార్ తెలిపారు. మన భారతీయ ఆహారం చిరుధాన్యాలను ప్రపంచంలో మరింత ప్రాచుర్యం పొందేలా తన ప్రయత్నమని అంటున్నారు. ఈ ప్రదర్శనను చర్చి ఫాదర్ ఎలియాస్, ప్రదర్శన చూసి ఎందుకు వచ్చిన వారంతా.. మిల్లెట్ ఆర్ట్ సజీవ చిత్ర ప్రదర్శనను సందర్శించి మోకా విజయ్ కుమార్ ప్రతిభను ప్రశంసించారు. అరుదైన ఈ చిత్రకళను ప్రోత్సహించడం అవసరమని వీరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎంతో చక్కగా.. తదేకంగా చూస్తే గాని..
చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ తో రూపొందించిన ఈ చిత్రాలను తదేకంగా చూస్తే గానీ నమ్మలేరు. ఈ చిత్రల కోసం ఆరు రకాల మిల్లెట్స్ ను వినియోగించారు మోకా విజయ్ కుమార్. స్కిన్ టోన్, ఆర్ట్ షేడ్ కు అనుగుణంగా అరికెలు, కొర్రలు, సామలు నల్ల సామలు, అంటు కొర్రలతో నేచురల్ కలరీంగ్ చేశారు. దగ్గర నుంచి చూస్తే గాని.. ఆ చిత్రం చిరుధాన్యాలతో చేసినట్టు అనిపించదు. ఎందుకంటే అంతలా తన ప్రతిభ అంతటినీ జోడించి కళారూపానికి జీవం పోశాడు. మిల్లెట్స్ తో రూపొందించిన ఈ కళారూపాలను చూసి ఔరా అంటున్నారు సందర్శకులు.
హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




