Andhra: కంత్రీ కట్లపాము.. 4 రోజులుగా కారులోనే మకాం.. చివరకు
కోవెలకుంట్ల తాసిల్దార్ పవన్ కుమార్ రెడ్డి కారులో పాము చొరబడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నాలుగు రోజులపాటు కారు లోనే చిక్కుకున్న పామును సిబ్బంది ఎంతో కష్టపడి బయటకు తీయడానికి ప్రయత్నించారు. చివరికి నంద్యాలలో మెకానిక్ వద్ద కూడా పాము బయటకి రాలేదు. చివరికి...

నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో.. కార్యాలయం వద్ద నిలిపి ఉంచిన తహసీల్దార్ పవన్ కుమార్ రెడ్డి కారులోకి పాము చొరబడింది. పామును బయటకి రప్పించేందుకు సిబ్బంది నానా తంటాలు పడ్డారు. అయినా ఆ పాము బయటకు రాలేదు. నాలుగు రోజులుగా పాము కారులో ఉంది. ఈ నాలుగు రోజులపాటు పామును బయటకు రప్పించేందుకు సిబ్బంది విఫలమయ్యారు..
తహసీల్దార్ నంద్యాలకి తీసుకెళ్లి, కారుకు మెకానిక్ దగ్గర చూపించారు. అక్కడ అతను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ పాము బయటకి రాలేదు. గురువారం కూడా తహసీల్దార్ నంద్యాల నుండి కోవెలకుంట్లకు అదే కారులో తిరిగి వచ్చారు. కారును కార్యాలయం ఆవరణలో ఉంచి.. మరోసారి పామును బయటకి రప్పించేందుకు ప్రయత్నించారు.
ఎట్టకేలకు కారు ముందు భాగంలో దాక్కున్న పాము బయటకు తీయబడింది. అది కట్ల పాము అని.. జాగ్రత్తగా ఉండటంతో ప్రమాదం తప్పిందని తహసీల్దార్ చెప్పారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




