Andhra Pradesh: అత్యంత ప్రమాదకరమైన పాము.. స్నేక్ క్యాచర్ ఎలా పట్టుకున్నాడో తెలుసా.?
ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉన్న ఓ ఇంటి సమీపంలో 8 అడుగుల కోడినాగు, 3 అడుగుల రక్తపొడను..

ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉన్న ఓ ఇంటి సమీపంలో 8 అడుగుల కోడినాగు, 3 అడుగుల రక్తపొడను చాకచక్యంగా పట్టుకున్నాడు స్నేక్ క్యాచర్. ఈ పాము పందిని వెంటాడుతుండగా గమనించిన స్థానికులు.. రిస్క్యూ అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ క్రాంతిని పిలిపించారు. అత్యంత ప్రమాదకరమైన పాములైన వాటిని చాకచక్యంగా పట్టుకుని.. చివరికి అడవిలో విడిచిపెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, ప్రపంచవ్యాప్తంగా 3 వేలకుపైగా జాతులకు చెందిన పాములు ఉన్నాయి. వాటిలో సుమారు 600 జాతులు విషపూరితమైనవని జంతు నిపుణులు పేర్కొంటున్నారు. వీటిలో అత్యంత విషపూరితమైన పాము జాతులు కూడా ఉన్నాయి. ఇవి కాటేసిన క్షణాల్లోనే మనుషులు చనిపోతారని గుర్తించారు.